తేదీ 20-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 20 జనవరి 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ షేక్ షైక్ హసన్ బాషా గారు (హాజ్ కమిటీ చైర్మన్)
తేదీ 19-01-2026 (సోమవారం) న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్నారు. గౌరవనీయ మంత్రి శ్రీ ఎన్.ఎమ్.డి. ఫరూక్ గారు కార్యక్రమానికి హాజరై ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే ఎంఎల్సీ శ్రీ బీద రవి చంద్ర గారు కూడా పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు సూచిస్తూ త్వరితగతిన పరిష్కారం చూపుతామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమం ప్రజలకు మరింత చేరువయ్యేలా విజయవంతంగా నిర్వహించబడింది.