LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: పింఛన్లకు ఏటా రూ.33 వేల కోట్లు.. రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం.. సీఎం చంద్రబాబు హామీ!

Chandrababu: కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: పింఛన్లకు ఏటా రూ.33 వేల కోట్లు.. రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం.. సీఎం చంద్రబాబు హామీ!

పమిడిముక్కలలో సీఎం చంద్రబాబు ప్రసంగం: పేదల సేవే ప్రభుత్వ ధ్యేయం..

బందర్ పోర్టు, హైవేలు – అభివృద్ధి పనుల్లో వేగం..

కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పునర్వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజల కోసం పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని, ముఖ్యంగా పేదల రుణం తీర్చుకోవాలనే తపనతో పనిచేస్తున్నానని సీఎం చెప్పారు. ప్రజల సంతోషం చూసినప్పుడు తన కష్టాన్ని మరిచిపోతానని భావోద్వేగంగా తెలిపారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పారు. పింఛన్ల పంపిణీని భారంగా కాకుండా బాధ్యతగా చూస్తున్నామని పేర్కొన్నారు.

కార్మికుల అభివృద్ధికి లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని, ఇవి భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో 15 నగరాల్లో ఆధునిక సదుపాయాలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పని లేని రోజుల్లో కార్మికులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పారు.

తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతు కష్టం విలువ తనకు తెలుసని సీఎం చెప్పారు. కార్మికుల పిల్లలు కూడా భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇకపై ప్రతి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరును ప్రజలనే అడుగుతానని, పనితీరు సరిగా లేకుంటే వారికి మరో అవకాశం ఉండదని హెచ్చరించారు.

ఆరోగ్య రంగంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని, అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, తిరుపతి, అమరావతిలో ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ప్రస్తుతం మళ్లీ వెయ్యి కోట్లతో నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని, తర్వాత కృష్ణా నదికి అనుసంధానం చేస్తామని చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయానికి జిల్లాలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, హైదరాబాద్-మచిలీపట్నం హైవేను ఎక్స్‌ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖలో గూగుల్ సంస్థ భారీగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుందని వెల్లడించారు.

విద్యుత్ ఛార్జీలపై మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకు పెంచలేదని, ఎన్నికల వరకు పెంచబోమని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విధించిన ట్రూఅప్ ఛార్జీలను తగ్గించామని, గతంలో తొమ్మిది సార్లు విద్యుత్ ధరలు పెంచారని విమర్శించారు.

రాజకీయాలపై మాట్లాడిన సీఎం, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని అన్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ఇకపై విధ్వంస రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలు మంచి పాలనకు మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…