LPG Crisis India: గ్యాస్ కష్టాలకు చెక్.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.!! Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Tirumala: తిరుమలలో హిస్టారికల్ స్టెప్: రూ.25 కోట్లతో హై-టెక్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! LPG Crisis India: గ్యాస్ కష్టాలకు చెక్.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.!! Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Tirumala: తిరుమలలో హిస్టారికల్ స్టెప్: రూ.25 కోట్లతో హై-టెక్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్!

India Iran Relations: చమురు రవాణాపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Iran Israel War 2026: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు రవాణాకు కలుగుతున్న ఆటంకాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడి, ప్రాంతీయ శాంతి భారతీయ పౌరుల రక్షణ గురించి చర్చించిన పూర్తి వివరాలు..

Published : 2026-03-22 08:12:00

Iran Israel War 2026: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఆయన ఫోన్‌లో  మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై మోదీ చర్చించారు.

ప్రస్తుతం జరుగుతున్న దాడుల వల్ల చమురు, సహజవాయువు మౌలిక వసతులు దెబ్బతినడం పట్ల మోదీ ఆవేదన చెందారు. ఇలాంటి దాడులు ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర మార్గాల ద్వారా జరిగే నౌకా రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగాలంటే ఆ ప్రాంతంలో ప్రశాంతత చాలా అవసరమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ప్రధాని మోదీ రంజాన్ పండుగ  ఇరాన్ నూతన సంవత్సరం 'నవ్‌రోజ్' శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, హింస ఎప్పటికీ దేనికీ పరిష్కారం కాదని భారత్ నమ్ముతుందని మోదీ పునరుద్ఘాటించారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల రక్షణ గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నందుకు ఇరాన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాలు సమన్వయంతో పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు. పశ్చిమాసియాలో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, శాంతి సుస్థిరతలు మళ్లీ నెలకొంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు సంయమనం పాటించి, శాంతి చర్చలకు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రాంతం వైపు ఆశగా చూస్తున్న తరుణంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Spotlight

Read More →