Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Tirumala: తిరుమలలో హిస్టారికల్ స్టెప్: రూ.25 కోట్లతో హై-టెక్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! New Railway Line: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ - హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 230 కి.మీ! నాలుగవ రైల్వే లైన్ Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Tirumala: తిరుమలలో హిస్టారికల్ స్టెప్: రూ.25 కోట్లతో హై-టెక్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! New Railway Line: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ - హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 230 కి.మీ! నాలుగవ రైల్వే లైన్

Rythu Bharosa Status 2026: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!

Rythu Bharosa Status 2026: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి, రైతు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. ఎకరం లోపు ఉన్న రైతులకు రేపటి నుంచే నగదు జమ కానుంది

Published : 2026-03-22 07:29:00

Telangana Govt Schemes: తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వానాకాలం సాగుకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధులను విడుదల చేసేందుకు సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా నర్మెటలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది.

మొదటి విడతలో భాగంగా కేవలం ఎకరం లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 3,590 కోట్లను సిద్ధం చేసింది. అయితే, ఈరోజు ఆదివారం బ్యాంకులు సెలవు కావడంతో, సాంకేతిక ప్రక్రియ పూర్తయ్యాక రేపు అంటే సోమవారం ఉదయం నుండి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. దీనివల్ల సుమారు 24 లక్షల మందికి పైగా రైతులకు తక్షణ ఉపశమనం లభించనుంది.

ఇక సిద్దిపేట పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రూ. 300 కోట్లతో నిర్మించిన భారీ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారు. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర మరియు దక్షిణ తెలంగాణలోని దాదాపు 18 జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇక్కడే ఒక ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, దీనివల్ల స్థానికంగానే పామాయిల్ ఉత్పత్తి పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.

రైతులకు మరో ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. కేవలం వరి  కే పరిమితం కాకుండా, ఇతర పంటలకు కూడా బోనస్ ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పప్పుధాన్యాలు, వేరుసెనగ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసే రైతులకు కూడా క్వింటాకు నిర్ణీత మొత్తంలో బోనస్ ఇచ్చే విధానంపై సీఎం నేటి సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పంట మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మూడు విడతల్లో ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి విడత తర్వాత మరో ఇరవై రోజుల వ్యవధిలో రెండు, మూడు విడతల నిధులు (సుమారు రూ. 5,400 కోట్లు) విడుదల కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటూనే, సాగు పనులు మొదలయ్యే సమయానికి రైతులకు పెట్టుబడి కష్టాలు లేకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

Spotlight

Read More →