LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Transco Updates: ఆ ప్రాంత వాసులకు మహర్దశ.. ఏపీలో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా!

AP Transco Updates: ఆంధ్రప్రదేశ్‌లో రూ. 40 వేల కోట్లతో విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పీజీసీఐఎల్ సిద్ధమైంది. 88 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాయలసీమలో భారీ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు.

AndhraPravasi News Desk 2 min read
AP Transco Updates: ఆ ప్రాంత వాసులకు మహర్దశ.. ఏపీలో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా!

AP Transco Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఇంధన రంగంలో ఒక పెద్ద ముందడుగు వేయబోతోంది. రాష్ట్రంలో సుమారు రూ. 40 వేల కోట్ల భారీ వ్యయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను  విస్తరించడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్తును ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి దేశవ్యాప్తంగా 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఏపీలో గాలి, సౌర  పంప్డ్ స్టోరేజ్ ద్వారా దాదాపు 88 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇంత భారీ స్థాయిలో తయారయ్యే కరెంటును గ్రిడ్‌కు అనుసంధానం చేయాలంటే పటిష్టమైన లైన్లు అవసరం. అందుకే ఈ 40 వేల కోట్ల రూపాయలను కొత్త లైన్లు  సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు.

ఈ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కీలక కేంద్రంగా మారబోతోంది. మెజారిటీ విద్యుత్ ప్రాజెక్టులు ఇక్కడే వస్తుండటంతో, కర్నూలు  అనంతపురం జిల్లాల్లో భారీ సబ్‌స్టేషన్లను నిర్మించనున్నారు. కర్నూలు-3, కర్నూలు-4, అనంతపురం ఎన్పీ కుంట వంటి ప్రాంతాల్లో అత్యాధునిక పూలింగ్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సబ్‌స్టేషన్ నిర్మాణానికే దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కేవలం ఇళ్లకే కాకుండా, రాష్ట్రానికి వస్తున్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుంది. విశాఖపట్నంలో గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్న భారీ డేటా సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్ అందించడం ఈ నెట్‌వర్క్ ప్రధాన ఉద్దేశం. ఒకవైపు కేంద్ర సంస్థ పీజీసీఐఎల్ పనులు చేస్తుండగా, మరోవైపు రాష్ట్ర ట్రాన్స్‌కో కూడా తన వంతుగా రూ. 21,500 కోట్లతో తన పరిధిలోని లైన్లను ఆధునీకరించే పనిలో పడింది.

వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఒక హబ్‌గా మారబోతోంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం  ఉంటుందని కేంద్రం నమ్మకం  ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరగడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…