LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Payyavula Keshav: రాయలసీమ ప్రాజెక్ట్‌పై రాజకీయాలు దారుణం.. మంత్రి పయ్యావుల ఫైర్!

Payyavula Keshav: రాయలసీమ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయడం హేయమని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు.

AndhraPravasi News Desk 2 min read
Payyavula Keshav: రాయలసీమ ప్రాజెక్ట్‌పై రాజకీయాలు దారుణం.. మంత్రి పయ్యావుల ఫైర్!

రాయలసీమపై ప్రేమ ఉన్నట్టు మరోసారి రాజకీయం చేయాలని చూస్తున్నారు..

మీ హాయాంలోనే ఎన్జీటీ ఆదేశాలతో రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది కాదా..

అమరావతి: రాయలసీమ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయడం హేయమని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నాయకులు రాయలసీమపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్జీటీ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఆగిపోయిందని మంత్రి గుర్తుచేశారు. అలాంటి ప్రాజెక్ట్‌ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపుతుంది అంటూ విమర్శించడంలో అర్ధం లేదని అన్నారు.

వైసీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. “మా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు రూ.3,700 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసింది. ఇది చరిత్రలో రికార్డు” అని చెప్పారు. ఇకపై మరో రూ.2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

రాయలసీమ అభివృద్ధికి రూ.40 వేల కోట్లతో భారీ హార్టీకల్చర్ హబ్‌ను తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని చెప్పారు.

ఎన్టీఆర్ కాలంలో ప్రారంభమైన గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల వల్లే నేడు రాయలసీమకు నీటి లభ్యత పెరిగిందని మంత్రి గుర్తుచేశారు. కానీ వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టులపై ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు.

తుంగభద్ర డ్యాం గేట్లు దెబ్బతిన్నప్పుడు తక్షణమే స్పందించి నిపుణులను తీసుకువచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 33 గేట్లలో 18 గేట్లు బిగించామని, వర్షాకాలం రాకముందే మిగతా గేట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు.

రాయలసీమ ప్రాజెక్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పూర్తి చేశామని మంత్రి వివరించారు. అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు.

రాయలసీమపై వైసీపీ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మంత్రి విమర్శించారు. తమ పాలనలో ప్రాజెక్ట్‌పై స్టే వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని హితవు పలికారు.

రాయలసీమ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…