LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి.. ఏపీఈడీబీ అధికారులకు మంత్రి దిశానిర్దేశం!

Nara Lokesh Speech For Jobs: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పమే మన ఏకైక లక్ష్యం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(APEDB) నూతన క…

AndhraPravasi News Desk 2 min read
Nara Lokesh: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి.. ఏపీఈడీబీ అధికారులకు మంత్రి దిశానిర్దేశం!
  • మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి..
     
  • ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి..

Nara Lokesh Speech For Jobs: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పమే మన ఏకైక లక్ష్యం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టెక్ పార్క్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యాలయం మొత్తం కలియతిరిగారు. 

ఈ సందర్భంగా ఏపీఈడీబీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ..  గత ప్రభుత్వం ఏపీఈడీబీని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి. యువగళం పాదయాత్ర సమయంలో యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాను. జీడీ నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం వద్దని, తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్దఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశానికి వచ్చిన వంద రూపాయల పెట్టుబడుల్లో 25 రూపాయాలు ఏపీకి వచ్చాయి. ఇందుకు ఈడీబీ బృందానికి అభినందనలు. సీఈవో సాయికాంత్ వర్మకు నా హృదయపూర్వక అభినందనలు.

ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి
గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. ఇప్పుడు మనం మరింత స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఉద్యోగాలు కల్పించామన్నదే ముఖ్యం. రిలయన్స్ సీబీజీ ప్రాజెక్ట్ వల్ల పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యోగాల కల్పనే మన సింగిల్ ఎజెండాగా ఉండాలి.  నూతన పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ మన ప్రధాన లక్ష్యం కావాలి. ఛాలెంజ్ గా తీసుకోవాలి. మన ఏకైక లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన అని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ మీకు కేటాయించిన క్లస్టర్‌లో నిపుణులుగా మారాలి. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించాం. వర్టికల్ ఇంటిగ్రేషన్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ పై దృషి సారించాలి. ఒప్పందం కుదుర్చుకున్న ప్రతి ప్రాజెక్ట్ గ్రౌండ్ కావాలి. ప్రతి ప్రాజెక్ట్ ను సమీక్షించడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు. అధికారులు, సిబ్బంది ఉన్నతంగా ఆలోచించాలి.  ఈ నెల 23 రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. ఇంతటితో తృప్తిపడకూడదు. ఎందుకు ఐదు స్టీల్ సిటీలు నిర్మించకూడదు? అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరినాటికి ఉండవల్లి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ప్రతిఒక్కరం ఎంతో కష్టపడుతున్నాం. దేశం, రాష్ట్రం, ఈడీబీ గర్వపడే విధంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ ఎమ్.అభిషిక్త్ కిషోర్ ఇతర ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు. 

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…