LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Fuel: పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దు.. -మంత్రి కొలుసు పార్థ సారథి!

Fuel: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి స్పష్టం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Fuel: పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దు.. -మంత్రి కొలుసు పార్థ సారథి!

డీజిల్, పెట్రోల్‌పై ఆ పార్టీ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది..

ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు, గూగుల్ త్వరలో ప్రారంభం..

విజయవాడ: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నాయకులు నెగటివ్ ప్రచారం ద్వారా ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే ఇటువంటి అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుంటే, కొందరు దానిని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టుతున్నాయని మంత్రి తెలిపారు. గూగుల్ సంస్థ కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతుందని చెప్పారు. ఇప్పటికే రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు.

డీజిల్ కొరతపై వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ… కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందన్నారు. పానిక్ పర్చేస్‌ల కారణంగా కొంత ఒత్తిడి ఏర్పడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తూ సరఫరాను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతులు, ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం స్టాక్ అవుట్ బంకుల సంఖ్య తగ్గుతోందని, పరిస్థితి త్వరలో పూర్తిగా సాధారణమవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. ధాన్యం చెల్లింపులు 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని వెల్లడించారు. మొక్కజొన్న రైతుల సమస్యను కేంద్రానికి తెలియజేశామని, స్పందన వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. పొగాకు, కోకో, మామిడి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధర అందిస్తున్నామని వివరించారు.

నీటిపారుదల రంగంలో కూడా మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని, డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి O&M నిధులు కేటాయించి టెండర్ల ద్వారా పనులు చేపడుతున్నామని చెప్పారు.

పెట్రోల్ బంకుల్లో కొరత ఉందన్న వార్తలను ఖండిస్తూ, ఎక్కడా నిల్వల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ధరలు అంతర్జాతీయ మార్కెట్ మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు.

ఇటీవల చిత్తూరు జిల్లా వి.కోటలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారిపై దాడులు చేయడం అనాగరిక చర్య అని పేర్కొంటూ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.

చివరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ… పెట్రోల్, డీజిల్ విషయంలో పుకార్లను నమ్మకుండా, పానిక్ పర్చేస్‌లకు పాల్పడవద్దని మంత్రి కోరారు. ప్రభుత్వం సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…