Amaravati: సింగపూర్ టు అమరావతి.. ట్రేడ్ కారిడార్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! Amaravati: సింగపూర్ టు అమరావతి.. ట్రేడ్ కారిడార్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం!

Mahanadu: నెల్లూరు మహానాడుకు సిద్ధం.. కొవ్వూరులో వేదికను పరిశీలించిన మంత్రి ఆనం!

Mahanadu: ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహానాడు వేదికను ఖరారు చేసిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు.

Published : 2026-05-05 20:56:00

మహానాడు కార్యక్రమంలో జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది..

కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి  సభ్యులు వచ్చి స్థలం పరిశీలించి ఫైనల్ చేశారు..

కొవ్వూరు: ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహానాడు వేదికను ఖరారు చేసిన నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు.

స్థల పరిశీలన అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ, మహానాడు కోసం అవసరమైన స్థలం ఎంపిక పూర్తైందని తెలిపారు. ఈ స్థలాన్ని ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సభ్యులు పరిశీలించి ఫైనల్ చేశారని, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు.

మహానాడు మూడు రోజుల కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. రేపు ఉదయం శుభ ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని తెలిపారు. మహానాడు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి, వక్ఫ్ బోర్డు చైర్మన్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణాన్ని సందర్శించినట్లు చెప్పారు.

మహానాడుకు సంబంధించిన ప్రణాళిక మొత్తం ఇప్పటికే సిద్ధమైందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ మహానాడు ప్రాంగణంలోనే బస చేయనున్నారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ చరిత్రలో 44 ఏళ్లలో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు జరగడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ మహానాడుతో నెల్లూరు జిల్లా ముఖచిత్రం మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడు రోజుల మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. కొవ్వూరులో ఎంపిక చేసిన ఈ వేదికలో జరిగే మహానాడు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.

Spotlight

Read More →