LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు!

PM Modi: కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాల పాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

AndhraPravasi News Desk 2 min read
PM Modi: అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్‌ కేరాఫ్ అడ్రస్.. బెంగళూరు సభలో ప్రధాని నిప్పులు!
  • రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయానికైనా దిగజారుతుందని ఆగ్రహం..
     
  • Politics: డీఎంకేతో పొత్తు వల్ల కాంగ్రెస్ ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని వ్యాఖ్య..

PM Modi: కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడులో దశాబ్దాల కాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. కేవలం అధికారంపై ఉన్న దురాశతోనే ఎంతోకాలంగా తోడున్న మిత్రుడిని వదిలేసిందని, ఇది ఆ పార్టీ నైజానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో 2014కు ముందు పదేళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించడానికి డీఎంకే మద్దతే కారణమని గుర్తు చేసిన ప్రధాని, కష్టకాలంలో ఆ పార్టీని వదిలిపెట్టి కొత్తగా వచ్చిన టీవీకేతో చేతులు కలపడం ద్వారా స్టాలిన్‌ను మోసం చేసిందని దుయ్యబట్టారు. అధికారం కోసం దొరికిన తొలి అవకాశంలోనే మిత్రధర్మాన్ని విస్మరించిన తీరును ఆయన తూర్పారబట్టారు.

రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయాలకైనా దిగజారుతుందని, అందుకే ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన ఆ పార్టీ నేడు 100 సీట్లు కూడా సాధించలేక పోతోందని ప్రధాని ఎద్దేవా చేశారు. ఓటమిని అంగీకరించలేని అహంకారం కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలకు ఉందని, ప్రతి చిన్న విషయానికి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగ సంస్థలను నిందించడం వారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపిస్తూ, అంతర్గత కలహాల వల్ల రాష్ట్రంలో సుపరిపాలన కుంటుపడిందని మండిపడ్డారు. గత మూడేళ్లుగా పార్టీలోని విభేదాలను పరిష్కరించుకోవడానికే సమయం సరిపోతోందని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటారో కూడా చెప్పలేని అయోమయ స్థితిలో ఆ పార్టీ ఉందని వ్యాఖ్యానించారు.

సరైన అజెండా లేకపోవడం వల్లే దేశ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ప్రజలు సురక్షితమైన పాలన మరియు అభివృద్ధి కోసం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ మరియు అసోం ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ బెంబేలెత్తుతోందని, రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయ విలువలను గాలికొదిలేసి మిత్రపక్షాలను వంచించే కాంగ్రెస్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని తన ప్రసంగంలో హెచ్చరించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…