LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Mahanadu: మహానాడును విజయవంతం చేయాలని లోకేష్ పిలుపు! పండుగ వాతావరణంలో నిర్వహించాలని దిశానిర్దేశం!

Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడును రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

AndhraPravasi News Desk 2 min read
Mahanadu: మహానాడును విజయవంతం చేయాలని లోకేష్ పిలుపు! పండుగ వాతావరణంలో నిర్వహించాలని దిశానిర్దేశం!

1875 క్లస్టర్లలో టీడీపీ మహానాడు నిర్వహణ..

‘స్త్రీ శక్తి మహానాడు’గా ఈసారి టీడీపీ మహానాడు..

అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడును రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడు ఏర్పాట్లపై రాష్ట్రంలోని 1875 క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ఆయన ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, అది తెలుగుదేశం పార్టీ బలం, క్రమశిక్షణ, త్యాగం, సంస్థాగత స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీగా టీడీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని పేర్కొన్నారు.

కోవిడ్ సమయంలో మహానాడును వర్చువల్‌గా నిర్వహించాల్సి వచ్చిందని గుర్తుచేసిన లోకేష్, అనంతరం ఒంగోలులో జరిగిన మహానాడు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించామని తెలిపారు. ఈసారి “స్త్రీ శక్తి మహానాడు” థీమ్‌తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మహిళలకు పెద్దపీట వేయడమే లక్ష్యమని చెప్పారు.

నెల్లూరులో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించాలని భావించినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు మరియు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో ఈసారి హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నామని వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొంటారని, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రాల్లో వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి క్లస్టర్‌లో కుటుంబ సాధికార సారధి నుంచి బూత్ ఇంఛార్జ్‌లు, గ్రామ కమిటీలు, క్లస్టర్ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలని లోకేష్ సూచించారు. క్లస్టర్ వ్యవస్థను బలోపేతం చేయడమే పార్టీ లక్ష్యమని, ఇది నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని పెంచే మంచి అవకాశమని చెప్పారు.

మహానాడు నిర్వహణ కోసం పార్టీ తరఫున అవసరమైన మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. క్లస్టర్ కేంద్రాల్లో ఎల్ఈడీ టీవీలు, స్పీకర్లు, సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మై టీడీపీ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తామని చెప్పారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, కేఎస్ఎస్ సభ్యులు, అనుబంధ విభాగాలు, బూత్ కమిటీలు, గ్రామ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపించాలని లోకేష్ సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రతి కార్యకర్త దీన్ని బాధ్యతగా తీసుకోవాలని ఆయన అన్నారు. “వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థే శాశ్వతం” అని పేర్కొంటూ, పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు క్లస్టర్ ఇంఛార్జ్‌లకు కీలక బాధ్యతలు అప్పగించామని చెప్పారు.

గత 23 నెలలుగా సుమారు 60 నియోజకవర్గాల్లో పర్యటించానని, 25 నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించామని లోకేష్ తెలిపారు. ప్రజలతో మమేకం అవుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మై టీడీపీ యాప్ ద్వారా చురుకైన కార్యకర్తలను గుర్తిస్తున్నామని చెప్పారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరూ క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల, పట్టణ, డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…