LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savitha: కడప జిల్లా రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం!

Minister Savitha: కడప జిల్లాలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు …

AndhraPravasi News Desk 1 min read
Minister Savitha: కడప జిల్లా రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం!

బీసీ బిడ్డ కుటుంబానికి ఆర్థికసాయం..

బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం..

అమరావతి: కడప జిల్లాలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

తొండూరు బీసీ హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న గురు ప్రణీత్ కుమార్ (11) వేసవి సెలవుల సందర్భంగా తన అన్నయ్య, తల్లితో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వేంపల్లి మండల కేంద్రానికి చెందిన ఈ బాలుడు వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పసి వయసులోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి సవిత, “బిడ్డను కోల్పోయిన తల్లి పడే బాధను మాటల్లో చెప్పలేం. ఆ కుటుంబం పడుతున్న వేదనను తట్టుకోవడం చాలా కష్టం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టసమయంలో ప్రభుత్వం వారి పక్కనే ఉందనే భావన కలిగించేందుకు ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించాలని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఈ సాయం కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.

విధ్యార్ధి మృతి గ్రామంలోనే కాదు, మొత్తం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. విద్య కోసం హాస్టల్‌లో ఉంటున్న బాలుడు ఇలా అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు కూడా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం కొంతైనా ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…