Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! New Airport: శంషాబాద్ తర్వాత రెండో పెద్ద హబ్... ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో మారనున్న తెలంగాణ ఫేస్! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Nara Lokesh: మహిళా కూలీల మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండ! Chandrababu: స్వచ్ఛత నుంచి అభివృద్ధి వరకు.. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! New Airport: శంషాబాద్ తర్వాత రెండో పెద్ద హబ్... ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో మారనున్న తెలంగాణ ఫేస్! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Nara Lokesh: మహిళా కూలీల మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండ! Chandrababu: స్వచ్ఛత నుంచి అభివృద్ధి వరకు.. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్!

Amaravathi: 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సింగపూర్ అనుభవాలు పంచుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్!

Amaravathi: 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ పర్యటనలో పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఈసారి సింగపూర్ పర్యటన ఎంతో ప్రత్యేకమైందని, పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామని తెలిపారు.

Published : 2026-05-07 13:57:00

పరిపాలనలో ఖచ్చితత్వం, సమన్వయం పెంచుకోవాలని సూచన..

ఈసారి సింగపూర్ పర్యటన చాలా ప్రత్యేకమైంది..

అమరావతి: 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి అనగాని సత్యప్రసాద్ సింగపూర్ పర్యటనలో పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఈసారి సింగపూర్ పర్యటన ఎంతో ప్రత్యేకమైందని, పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో భారీ పరిపాలనా వ్యవస్థ ఉన్నప్పటికీ, సింగపూర్ మాత్రం పనులను అత్యంత ఖచ్చితత్వంతో, సమన్వయంతో నిర్వహించడంలో ముందుందని మంత్రి పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఉన్న విస్తృత వ్యవస్థను సింగపూర్ తరహా ఖచ్చితత్వంతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 500 రకాల సేవలు అందిస్తున్నప్పటికీ, అవన్నీ ఒకే చోట సులభంగా అందేలా చేయడంలో ఇంకా మెరుగుదల అవసరమని సూచించారు. సింగపూర్ మాదిరిగా ప్రజలకు అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆర్టీజీఎస్, మీ భూమి, సింగిల్ డెస్క్ వంటి బలమైన వ్యవస్థలను పరస్పరం అనుసంధానించి మరింత సమర్థవంతంగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.

పరిశ్రమల విషయంలో కూడా సింగపూర్ విధానాన్ని ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తున్నప్పటికీ, సింగపూర్ లాగా పరిశ్రమలు రాకముందే భూమి, మౌళిక వసతులు సిద్ధంగా ఉంచే విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిపాలన బలంగా ఉన్నప్పటికీ, అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేలా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని మంత్రి సూచించారు. సింగపూర్‌లో చూసిన సమర్థవంతమైన పరిపాలన పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించవచ్చని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Spotlight

Read More →