LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nimmala Ramanaidu: కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన! పోలవరం పనుల పరిశీలన!

Nimmala Ramanaidu: కాకినాడ జిల్లాలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Nimmala Ramanaidu: కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన! పోలవరం పనుల పరిశీలన!

తుని ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్‍లో పోలవరం ఎల్‍ఎంసీ పనుల పురోగతిపై సమీక్ష..

పనులు ఆలస్యం చేస్తే, ఉపేక్షించేది లేదని అధికారులకు హెచ్చరిక..

కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ (LMC) పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు.

మొదటగా అన్నవరంలోని పంపా అక్విడెక్ట్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. పనుల నాణ్యత, వేగంపై అధికారులను ప్రశ్నిస్తూ, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అనంతరం ఆరెంపూడి, గవరయ్య కోనేరు ప్రాంతాల్లో హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణాన్ని పరిశీలించి, పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.

తరువాత తుని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ఎల్‌ఎంసీ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని, ఆలస్యానికి ఎలాంటి కారణాలైనా సహించబోమని మంత్రి గట్టిగా హెచ్చరించారు. పనులు వేగంగా పూర్తి చేయకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో పోలవరం ఎడమ కాలువ పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

రైతులకు నీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…