LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది..

Narayana Comments On ycp: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఎదురైన సవాళ్లు, అమరావతి రాజధాని ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది..
  • Politics: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. నార్మన్ ఫోస్టర్ డిజైన్లు: అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం..
     
  • మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి అంధకారం: వైసీపీ హయాంలో రాజధాని విధ్వంసాన్ని వివరించిన మంత్రి..

Narayana Comments On ycp: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఎదురైన సవాళ్లు, అమరావతి రాజధాని ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ప్రజలంతా రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరినప్పటికీ, నాటి పాలకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని విభజించారని ఆయన విమర్శించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందని, విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచినప్పటికీ, సొంత గడ్డపై పరిపాలన సాగించాలనే సంకల్పంతో విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటంతో పాటు రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిని ఎంపిక చేశామని, 2014లో ఈ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని మంత్రి గుర్తు చేశారు.

రాజధాని నిర్మాణం కోసం ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి, 29 వేల మంది రైతుల నుంచి సుమారు 30 వేల ఎకరాల భూమిని ఎటువంటి వివాదాలు లేకుండా సేకరించామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కౌలుతో పాటు నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం, ఐకానిక్ భవనాల కోసం అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన నార్మన్ ఫోస్టర్ సంస్థతో డిజైన్లు సిద్ధం చేయించామన్నారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై విషప్రచారం మొదలుపెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. అమరావతిలో భూకంపాలు వస్తాయని, వరదలు ముంచెత్తుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, రివర్ బెడ్ మరియు రివర్ బేసిన్ కు మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని విమర్శించారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ అర్థరహితమైన వాదనలు చేస్తూ, రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులను రెచ్చగొట్టి, వారి త్యాగాలను కించపరిచేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి గత పాలకులు పన్నిన కుట్రలను అధిగమించి, ఇప్పుడు మళ్లీ రాజధాని పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…