LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Narayana: డంపింగ్ యార్డ్‌ల రహిత మున్సిపాలిటీల దిశగా ఏపీ ప్రభుత్వం!

Minister Narayana: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు.

AndhraPravasi News Desk 1 min read
Minister Narayana: డంపింగ్ యార్డ్‌ల రహిత మున్సిపాలిటీల దిశగా ఏపీ ప్రభుత్వం!

డంపింగ్ యార్డ్‌లకు చెక్.. చెత్త నిర్వహణలో కొత్త మార్గం : మంత్రి నారాయణ..

రాష్ట్రవ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు..

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్‌ల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.

ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా మరో ఆరు కొత్త ప్లాంట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న చెత్తను సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ ప్లాంట్ల ద్వారా ప్రతి రోజు సుమారు 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్‌, బయోగ్యాస్‌గా మారుస్తామని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్తను ఉపయోగకరమైన వనరుగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ఆధునిక సాంకేతికతతో చెత్త నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు.

గత ప్రభుత్వం చెత్త పన్ను విధించినప్పటికీ సుమారు 150 లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా వదిలి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్తను తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.

నిర్మాణంలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లన్నింటినీ వచ్చే నెలాఖరునాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కూడా చెత్త నిర్వహణలో భాగస్వాములు కావాలని, పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…