LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Mandipalli: స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి.. ఆ సమయంలో ఎలక్ట్రిక్ బస్సులు!

Minister Mandipalli Comments On Jagan: స్త్రీ శక్తి పథకం అమలుపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొందిన సంక్షేమ పథకమని మంత్రి తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Minister Mandipalli: స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి.. ఆ సమయంలో ఎలక్ట్రిక్ బస్సులు!
  • స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం...మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
     
  • వైసీపీ హయాంలో టికెట్ చార్జీల పెంపు, బస్సుల సర్వీసుల నిలిపివేత..

Minister Mandipalli Comments On Jagan: స్త్రీ  శక్తి పథకం అమలుపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొందిన సంక్షేమ పథకమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం భాధ్యతతో ఈ పద్ధకాన్ని అమలు చేస్తుంటే జగన్ కడుపు మండుతుందని,  పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 మేర లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు సుమారు 50 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసినట్లు చేశారని , ఎక్కువగా ప్రయాణం చేసే ఐదు రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని ఈ సేవలే  విరివిగా అందుబాటులో ఉంటున్నాయని మంత్రి తెలిపారు

వైసీపీ హయాంలో ఒక్క బస్సు కొనలేదు
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం సుమారు 1450 కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ హయాంలో టికెట్ చార్జీల పెంపు, బస్సుల సర్వీసుల నిలిపివేత
వైసీపీ పాలనలో బస్సు టికెట్ చార్జీలు మూడు సార్లు పెంచారని, వందల సంఖ్యలో బస్సు సర్వీసులను నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. ఆ సమయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడంలో కూడా నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి చర్యలు
గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ ఎదుర్కొన్న అనేక సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం , అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళల సాధికారత, ప్రజా రవాణా బలోపేతం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…