LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల స్వర్ణయుగం.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం మరింత వేగం పడుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో దేశ, విదేశాల ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల స్వర్ణయుగం.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్!

రూ.1000 కోట్ల పెట్టుబడి.. వేలాది ఉద్యోగాలు..

ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ తయారీ యూనిట్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం మరింత వేగం పడుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో దేశ, విదేశాల ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ కారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఏపీలో భారీ పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

ఈ నూతన ప్రాజెక్టుకు రేపు శ్రీసిటీలో శంకుస్థాపన జరగనుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. గత 22 నెలల్లోనే సుమారు 800 ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడం పరిశ్రమల పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది.

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానుండగా, దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 3వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

దేశంలో పెరుగుతున్న HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చేందుకు ఈ ప్లాంట్ కీలకంగా మారనుంది. అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు (P&M)తో ఈ యూనిట్ నిర్మించబడుతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సమన్వయం, ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

దేశంలో ఇప్పటికే ఐదు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యారియర్ సంస్థకు హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో తయారీ యూనిట్, హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మరింత గౌరవం తెస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో మరో పెద్ద అడుగు ముందుకేసింది. పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి—అన్నీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…