LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Machilipatnam: రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం.. మంత్రి కొల్లు రవీంద్ర!

Machilipatnam: “రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం” అంటూ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంగా హెచ్చరించారు.

AndhraPravasi News Desk 2 min read
Machilipatnam: రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం.. మంత్రి కొల్లు రవీంద్ర!

పోర్టు రోడ్డులో అభివృద్ధి పనులపై వైసీపీ రాద్దాంతం సిగ్గుచేటు..

ఎవరెన్ని కుట్రలు చేసినా బందరుని అభివృద్ధి చేసి చూపిస్తా..

మచిలీపట్నం: “రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం” అంటూ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంగా హెచ్చరించారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలను నిర్వహిస్తూ ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 409 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎక్కువ భాగాన్ని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించామని చెప్పారు. ప్రస్తుతం 57 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, ఉద్యోగాలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మే నెలలో జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈ, ఫిషరీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నమోదు చేసుకున్న వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

మచిలీపట్నం అభివృద్ధిపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. ముఖ్యంగా పోర్టు రోడ్డులో అభివృద్ధి పనులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్దాంతాన్ని తప్పుపట్టారు. అక్కడ ప్రధాన సమస్య మురుగు నీరేనని, దాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.50 కోట్లతో రెండు ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలు వచ్చినా మురుగు నీరు పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అభివృద్ధి చేయలేని వారు, నిధులు తెచ్చుకోలేని వారు ఇతరులు చేసే పనులను విమర్శించడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. బందరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు. పేర్ని కిట్టు వర్గంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ, అధికారులను బెదిరించడం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం తప్ప వారు సాధించినదేమీ లేదని అన్నారు.

ఇక బందరు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డ్రైనేజీ, రోడ్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రూ.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, పోలాటితిప్ప–గరాలదిబ్బ రోడ్, నడమేరు–కొండేరు బ్రిడ్జికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

పేదల గృహ నిర్మాణంపై కూడా మంత్రి దృష్టి సారించారు. ఇప్పటికే జీ+3 ఇళ్లు నిర్మించి పేదలకు అందించామని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అలాగే బందరు పోర్టును పూర్తి చేసి, దాన్ని ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మార్చుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, మోటమర్రి బాబాప్రసాద్, కాగిత వెంకటరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…