LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Kollu Ravindra: మచిలీపట్నం శ్మశాన వాటికకు ఆధునిక రూపు.. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర!

Kollu Ravindra: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో ఉన్న శ్మశాన వాటికకు కొత్త రూపు తీసుకొస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి సురేష్ ఆర్థిక సహకారంతో అక్కడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛ…

AndhraPravasi News Desk 1 min read
Kollu Ravindra: మచిలీపట్నం శ్మశాన వాటికకు ఆధునిక రూపు.. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర!

ప్రముఖ పారిశ్రామిక వేత్త చుక్కపల్లి సురేష్ గారి ఆర్ధిక సహకారంతో అభివృద్ధి..

దహన సంస్కారాల కోసం వచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు..

మచిలీపట్నం: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో ఉన్న శ్మశాన వాటికకు కొత్త రూపు తీసుకొస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి సురేష్ ఆర్థిక సహకారంతో అక్కడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతిమ సంస్కారాలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కరోనా సమయంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ, ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని సుమారు 16 ఎకరాల శ్మశాన వాటిక గత కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలకు గురైందని, ఇప్పుడు దాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన చుక్కపల్లి సురేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శ్మశాన వాటికలో క్రిమేషన్ కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, భౌతిక దేహాలను ఉంచేందుకు ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, రోడ్లు, డ్రైనేజీలు, స్నానానికి అవసరమైన సదుపాయాలను మున్సిపాలిటీ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

మంగళగిరి, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో మొదటిసారిగా ఈ తరహా ఆధునిక శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ శ్మశానాన్ని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలోని ఇతర శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

దాతలు ముందుకు వస్తే వారితో కలిసి కమిటీ ఏర్పాటు చేసి, అన్ని శ్మశానాలను మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తిచేసి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…