LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Gummadi Sandhya Rani: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు! వైసీపీపై తీవ్ర విమర్శలు!

Gummadi Sandhya Rani: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

AndhraPravasi News Desk 1 min read
Gummadi Sandhya Rani: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు! వైసీపీపై తీవ్ర విమర్శలు!

అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేనివారిని పట్టించుకోము..

సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి..

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

“అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని వారిని పట్టించుకోము” అంటూ స్పష్టం చేసిన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలపై విమర్శించారు. “జగన్ రాజకీయాలు చేయాలనుకుంటే ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలి. సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి” అని అన్నారు.

ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు. “వారికి ఒక్క అవకాశం దొరికితే కబ్జాలు చేసి, ప్రజల ఆస్తులను లాక్కొని ఎవరూ బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖ వాసుల మంచితనాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారు” అని తీవ్రంగా ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వివరించారు. “విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ రాష్ట్రానికి వచ్చింది” అని చెప్పారు.

ఇంకా ఆర్సిలర్ మిట్టల్ సహా పలు పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ ప్రాంతం త్వరలోనే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల సహకారంతో మరింత పురోగతి సాధిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…