LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Central Government Announcement: సామాన్యులకు ఊరటనిచ్చిన కేంద్రం.. ధరల పెరుగుదలపై కీలక ప్రకటన!

Middle East War: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ భారత్‌లో నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మూడు రెట్లు అధికంగా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చమురు, ఎల్‌పీజీ సరఫరాపై …

AndhraPravasi News Desk 2 min read
Central Government Announcement: సామాన్యులకు ఊరటనిచ్చిన కేంద్రం.. ధరల పెరుగుదలపై కీలక ప్రకటన!

Middle East War: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల మన దేశంలో వస్తువుల ధరలు ఎక్కడ పెరిగిపోతాయో అని సామాన్యులు కంగారు పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం  మంచి వార్త చెప్పింది. ప్రస్తుతం మన దగ్గర  ఆహార  ధాన్యపు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ధరలు పెరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. యుద్ధం జరుగుతున్నా సరే, నిత్యావసర వస్తువుల రేట్లను ప్రభుత్వం నిరంతరం కనిపెట్టుకుని ఉంటోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

దేశవ్యాప్తంగా వందలాది కేంద్రాల ద్వారా ప్రతిరోజూ సుమారు 40 రకాల ముఖ్యమైన వస్తువుల ధరలను అధికారులు పరిశీలిస్తున్నారు. పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి వాటి ఉత్పత్తి ఈ ఏడాది బాగుందని, ప్రభుత్వం దగ్గర సరిపడా బఫర్ స్టాక్ కూడా ఉందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా వస్తువులను అక్రమంగా దాచిపెట్టి, ధరలు పెంచాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఆహార ధాన్యాల విషయానికి వస్తే, మన దేశ అవసరాల కంటే మూడు రెట్లు ఎక్కువ నిల్వలు ఇప్పుడు గోదాముల్లో సిద్ధంగా ఉన్నాయి. సుమారు 602 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం మన దగ్గర ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల రేషన్ షాపులకు గానీ, బయట మార్కెట్‌కు గానీ ఎటువంటి కొరత రాదు. ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

సముద్ర మార్గంలో సరుకులు  నౌకల విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా  ఉందని. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల గుండా వచ్చే భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయని షిప్పింగ్ శాఖ తెలిపింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల తయారీకి వాడే ఎల్‌పీజీని తీసుకొచ్చే నౌకలు ఎప్పటికప్పుడు భారత్‌కు చేరుకుంటున్నాయి. అక్కడ పని చేస్తున్న మన భారతీయ నావికులు కూడా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది.

అయితే చమురు, గ్యాస్ దిగుమతుల విషయంలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని ప్రభుత్వం అంగీకరించింది. ఎందుకంటే మనకు వచ్చే గ్యాస్‌లో ఎక్కువ భాగం యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచే రావాలి. అయినప్పటికీ మన దేశ చమురు కంపెనీలు పరిస్థితిని చక్కదిద్దుతున్నాయని, ఇంధన కొరత రాకుండా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నామని  చెప్పుకొచ్చారు

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…