LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Middle East Crisis హార్ముజ్ జలసంధి దిగ్బంధనం.. గల్ఫ్ భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ అప్రమత్తం...!

Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కువైట్ సింగపూర్ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం ప్రభావం గల్ఫ్‌లోని భారతీయుల క్షేమంపై ఈ చర్చలు జరిగాయి.

AndhraPravasi News Desk 1 min read
Middle East Crisis హార్ముజ్ జలసంధి దిగ్బంధనం.. గల్ఫ్ భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ అప్రమత్తం...!

Middle East Crisis: గల్ఫ్ ప్రాంతంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధనం విధిస్తున్న తరుణంలో ఆయన కువైట్, సింగపూర్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల్లో ప్రధానంగా అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత, ప్రాంతీయ శాంతిపై సుదీర్ఘంగా చర్చించారు.

కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జబర్ అల్-అహ్మద్ అల్-సబాతో జైశంకర్ జరిపిన సంభాషణలో.. కువైట్‌లో ఉన్న లక్షలాది మంది భారతీయ కార్మికుల సంక్షేమం గురించి ఆరా తీశారు. యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ మనవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. అనంతరం "కువైట్ మంత్రితో మంచి చర్చలు జరిగాయి. ప్రాంతీయ పరిస్థితులతో పాటు మన భారతీయుల క్షేమం గురించి మాట్లాడుకున్నాం" అని జైశంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మరోవైపు సింగపూర్ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో కూడా జైశంకర్ మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావం గురించి వీరు చర్చించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవుల్లోకి ఏ నౌక వెళ్లకుండా, బయటకు రాకుండా అమెరికా సైన్యం దిగ్బంధనం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్త చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న 'హార్ముజ్ జలసంధి'పై ఈ ఆంక్షలు అమలులోకి రావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.

అమెరికా చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరుకుంది. భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. బంగారం సుమారు 1.55 లక్షలకు చేరగా, వెండి కేజీ 2.47 లక్షలకు పెరగడం సామాన్యులను భయపెడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల ఉపాధిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…