LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో భారీ మార్పులు.. పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట!

Kollu Ravindra: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యవస్థ అంటే ప్రజల్లో భయం, అనుమానాలు, అసంతృప్తి, అవినీతి ఆరోపణలు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.

AndhraPravasi News Desk 3 min read
Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో భారీ మార్పులు.. పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట!

పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎక్సైజ్ విధానం..

మద్యం నాణ్యతపై ల్యాబుల్లో పెద్ద ఎత్తున పరీక్షలు..

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యవస్థ అంటే ప్రజల్లో భయం, అనుమానాలు, అసంతృప్తి, అవినీతి ఆరోపణలు వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ప్రభుత్వం చెబుతోంది. పారదర్శకత, నాణ్యత, టెక్నాలజీ, ప్రజారోగ్య రక్షణ లక్ష్యంగా ఎక్సైజ్ శాఖలో గత 23 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం వెల్లడించింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చిన శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటిగా నిలిచింది. మద్యం వ్యవస్థలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ముందుగా ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్‌ఈబీ (SEB)ను రద్దు చేసి మొత్తం ఎక్సైజ్ వ్యవస్థను ఏకీకృతం చేసింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. అక్రమాలపై విచారణ కోసం ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. అలాగే 2024-26 నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి, లాటరీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాల కేటాయింపు చేపట్టారు.

ఈ పారదర్శక విధానానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల హామీ మేరకు 10 శాతం మద్యం షాపులు అంటే 354 దుకాణాలను కల్లు గీత కార్మికులకు కేటాయించారు.

గత ప్రభుత్వంలో అమలు చేసిన ARET విధానం వల్ల ప్రజలపై పడిన అదనపు భారాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. అలాగే గతంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు కేవలం 0.6 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అవి 45 శాతానికి చేరడం విశేషం. దీంతో నగదు లావాదేవీలకు బదులుగా పారదర్శకత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

మద్యం మార్కెట్‌లో అన్ని బ్రాండ్లకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం టెండర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రీమియం స్టోర్లను ఏర్పాటు చేశారు.

అలాగే నాటు సారా, కల్తీ మద్యం వైపు ప్రజలు వెళ్లకుండా తక్కువ ధరలో రూ.99 బ్రాండ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులోకి రావడం, ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండటంతో అక్రమ మద్యం రవాణా భారీగా తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ చర్యల ఫలితంగా 2024-25లో రూ.28,846 కోట్లు, 2025-26లో రూ.29,042 కోట్ల ఎక్సైజ్ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

డిస్టిలరీ నుంచి మద్యం దుకాణం వరకు ప్రతి బాటిల్‌ను ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో పర్యవేక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్యం వినియోగదారుల కోసం “ఎక్సైజ్ సురక్ష” యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు బాటిల్‌ను స్కాన్ చేసి అది ఎక్కడ తయారైందో, ఎలా సరఫరా అయిందో తెలుసుకునే అవకాశం కల్పించారు.

అలాగే “ఎక్సైజ్ ఐ” యాప్ ద్వారా రాష్ట్రంలోని మద్యం దుకాణాల సీసీ కెమెరాలను అనుసంధానించి ఎప్పుడు షాపులు తెరుస్తున్నారు, ఎప్పుడు మూస్తున్నారు అనే అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మద్యం బ్యాచ్‌ను 13 రకాల పరీక్షల అనంతరమే మార్కెట్లోకి పంపిస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, చిత్తూరు, కర్నూలులో అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.

గతంలో ఏటా సగటున 14 వేల పరీక్షలు మాత్రమే జరిగేవి. ప్రస్తుతం ప్రతి నెల 30 వేల వరకు శాంపిళ్లపై పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక ఈగిల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మద్యం ఆదాయంలో 2 శాతం నిధులను ఈ వ్యవస్థకు కేటాయించారు. అక్రమ రవాణా, నకిలీ మద్యం నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

గత ప్రభుత్వంపై కూడా ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. 2019 ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్యనిషేధం హామీ ఇచ్చి, తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో వ్యవస్థను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకెళ్లారని ఆరోపించింది.

ప్రపంచంలో ఎక్కడా లేని బూం బూం, ప్రెసిడెంట్ మెడల్ వంటి బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజలను బలవంతంగా కొనిపించారని విమర్శించింది. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో తమిళనాడు, తెలంగాణ, ఒడిశా నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగిందని పేర్కొంది.

డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేకుండా మొత్తం వ్యవస్థను క్యాష్ అండ్ క్యారీ విధానంలో నడిపారని ఆరోపించింది. గత ప్రభుత్వ కాలంలో 99.38 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగాయని ప్రభుత్వం తెలిపింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం గత ప్రభుత్వ కాలంలో మహిళలపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. 2019తో పోలిస్తే 2023 నాటికి లివర్ సమస్యలు 52 శాతం, కిడ్నీ సమస్యలు 54 శాతం పెరిగాయని తెలిపింది. గుంటూరు జీజీహెచ్‌లోని డీ-అడిక్షన్ కేంద్రంలో 2019లో 343 కేసులు ఉండగా, 2023 నాటికి అవి 4913కు పెరిగినట్లు వెల్లడించింది.

ఎక్సైజ్ శాఖలో తీసుకొచ్చిన మార్పులపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి డిస్టిలరీలో మద్యం తయారీ నుంచి బాటిలింగ్ వరకు అన్ని దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మద్యం దుకాణాలు, బార్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, బ్రాండ్ మిక్సింగ్ వంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో డిజిటల్ లావాదేవీలు 1 శాతం కూడా లేకపోయాయని, ఇప్పుడు 40 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరగడం పారదర్శక పాలనకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…