Chandrababu: హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్.. బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు! PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ: రేపు మధ్యాహ్నం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు! 2,000 మంది పోలీసులతో.. Telangana: రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్.. హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు! Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం! Amaravati: రాజధానిలో అత్యంత వేగంగా పూర్తవుతున్న రహదారి ఇదే! PM Modi: చారిత్రక విజయం.. వినమ్రంగా కృతజ్ఞతలు.. వేదికపై సాష్టాంగ పడి నమస్కరించిన ప్రధాని! Mamata Banerjee: 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో.. Pawan Kalyan: దశాబ్దాల పోరాటానికి ఫలితం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల గెలుపు.. పవన్ కల్యాణ్ హర్షం! Vijay: అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్! AP Secretariat: సచివాలయం వద్ద హై అలర్ట్... ప్రభుత్వం సీరియస్! అసలు విషయం ఏమిటంటే? Chandrababu: హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్.. బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు! PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ: రేపు మధ్యాహ్నం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు! 2,000 మంది పోలీసులతో.. Telangana: రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్.. హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు! Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం! Amaravati: రాజధానిలో అత్యంత వేగంగా పూర్తవుతున్న రహదారి ఇదే! PM Modi: చారిత్రక విజయం.. వినమ్రంగా కృతజ్ఞతలు.. వేదికపై సాష్టాంగ పడి నమస్కరించిన ప్రధాని! Mamata Banerjee: 'ఎక్స్' బయోలో కీలక మార్పు.. మమత రాజకీయ సందేశం! మూడుసార్లు ముఖ్యమంత్రినని బయోలో.. Pawan Kalyan: దశాబ్దాల పోరాటానికి ఫలితం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాల గెలుపు.. పవన్ కల్యాణ్ హర్షం! Vijay: అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్! AP Secretariat: సచివాలయం వద్ద హై అలర్ట్... ప్రభుత్వం సీరియస్! అసలు విషయం ఏమిటంటే?

West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు!

West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 2026-05-06 11:20:00
  • మమత వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అన్న‌ సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ..
     
  • Politics: ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ తర్వాత ఆమె సీఎం ఆఫీసులో చొరబాటుదారు అని వ్యాఖ్య..

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించడంపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రజాతీర్పును గౌరవించకుండా పదవికి అతుక్కుపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విసిరిన సవాల్ అని అభివర్ణించారు. ఎన్నికల సంఘం ఫలితాలను ధ్రువీకరించిన క్షణం నుంచే ముఖ్యమంత్రి తన అధికారిక హోదాను కోల్పోతారని, అయినా రాజీనామా చేయకుండా మొండికేయడం అత్యంత అవమానకరమని ఆయన విమర్శించారు.

ఉత్కంఠభరిత పరిస్థితుల్లో గవర్నర్ తన రాజ్యాంగబద్ధమైన అధికారాలను ఉపయోగించి మమతా బెనర్జీని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జెఠ్మలానీ డిమాండ్ చేశారు. పదవి నుంచి గౌరవంగా తప్పుకోని పక్షంలో, ఆమెను కార్యాలయం నుంచి బలవంతంగా బయటకు పంపాలని, అవసరమైతే గవర్నర్ పోలీసు బలగాలను పంపి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని సూచించారు. ఫలితాలు వెల్లడై ఓటమి ఖరారైన తర్వాత కూడా సీఎం కుర్చీలో కొనసాగడం చొరబాటు చర్యే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ గడువు ఈ నెల 7వ తేదీతో ముగియనుండటంతో, గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మొండి వైఖరిని వీడటం లేదు. తన పార్టీకి రావాల్సిన దాదాపు 100 సీట్లను దొంగిలించారని ఆరోపిస్తూ, తాను ఓడిపోయినట్లు అంగీకరించబోనని ఆమె ప్రకటించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకోవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఆరోపణలపై స్పందించిన జెఠ్మలానీ, కేవలం ఆరోపణలు చేయడం కాకుండా ఆధారాలుంటే కోర్టును ఆశ్రయించాలని, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును అపహాస్యం చేసే ఇటువంటి ధోరణులు సరైనవి కావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →