LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Mahanadu 2026: వేదిక మారిన మహానాడు! శ్రీకాకుళం నుండి నెల్లూరుకి! కారణం అదే..

Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ తన వార్షిక మహానాడు వేదికను ఈసారి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణాంధ్రలోని నెల్లూరుకు మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది.

AndhraPravasi News Desk 2 min read
Mahanadu 2026: వేదిక మారిన మహానాడు! శ్రీకాకుళం నుండి నెల్లూరుకి! కారణం అదే..

నెల్లూరులో తొలిసారి టీడీపీ మహానాడు..

వ్యూహాత్మకంగా వేదిక మార్పు..

అమరావతి: తెలుగుదేశం పార్టీ తన వార్షిక మహానాడు వేదికను ఈసారి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణాంధ్రలోని నెల్లూరుకు మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యకలాపాలు సమతుల్యంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా జూన్ నెలలో ఉత్తరాంధ్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉండటం ఈ మార్పుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. లక్షలాదిమంది పాల్గొనే ఈ సభకు భారీ ఏర్పాట్లు అవసరం కావడంతో, అదే ప్రాంతంలో నెలరోజుల వ్యవధిలో మరో పెద్ద కార్యక్రమం నిర్వహించడం కష్టసాధ్యమని పార్టీ భావించింది.

ఈ నేపథ్యంలో మే 27-28 తేదీల్లో జరగనున్న మహానాడును నెల్లూరుకు మార్చడం ద్వారా స్థానిక నేతలు, కార్యకర్తలపై పడే భారం తగ్గుతుందని పార్టీ అంచనా వేస్తోంది. ఒకే ప్రాంతంలో వరుసగా భారీ కార్యక్రమాలు నిర్వహిస్తే కేడర్‌పై ఒత్తిడి పెరిగి ఉత్సాహం తగ్గే అవకాశం ఉందని నాయకత్వం భావించింది. అందుకే రెండు ప్రాంతాల్లో కార్యక్రమాలను విభజించి నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఉత్సాహాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.

ఇక నెల్లూరులో మహానాడు నిర్వహించడం చారిత్రాత్మకంగా భావిస్తున్నారు. పార్టీ స్థాపనకు నాలుగు దశాబ్దాలకు పైగా అయినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ మహానాడు జరగలేదు. ఈసారి తొలిసారిగా ఈ అవకాశం రావడం స్థానిక నేతల్లో ఆనందాన్ని నింపింది.

తాజా ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి ‘క్లీన్ స్వీప్’ చేయడం కూడా ఈ నిర్ణయానికి దోహదపడింది. ఒకప్పుడు వైఎస్సార్సీపీకి బలమైన కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు టీడీపీ ప్రభావం పెరగడంతో, ఆ విజయోత్సాహాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ భావిస్తోంది.

నెల్లూరులో బలమైన స్థానిక నాయకత్వం ఉండటం కూడా మరో ముఖ్య కారణంగా చెప్పబడుతోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలు భారీ స్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం కలవారని పార్టీ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గం నుంచి సుమారు 50 వేల మందిని సమీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మహానాడు సందర్భంగా వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో వసతి, రవాణా వంటి ఏర్పాట్లపై ఉన్నత స్థాయి నాయకులు ఇప్పటికే సమన్వయం ప్రారంభించారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం ద్వారా పార్టీ అంతర్గత కార్యక్రమం అయిన మహానాడు, అలాగే ఉత్తరాంధ్రలో జరగనున్న కూటమి భారీ సభ రెండూ విజయవంతంగా నిర్వహించేందుకు టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…