Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా Amaravati Celebrations: అమరావతి గెలిచింది: గ్రామాల్లో సంబరాలు.. ఢిల్లీలో రాజకీయ కలయికలు! Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.! Nara Lokesh: "ధర్మం గెలిచింది.. అమరావతి నిలిచింది"... మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్! AP Capital: ఇక తిరుగులేదు... అమరావతి తలరాతను మార్చేసిన ఆ 'మూజువాణి ఓటు'! Talliki Vandanam Scheme: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఖాతాల్లోకి రూ.13,000 - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!! New Pensions: కొత్త పెన్షన్ల పంపిణీ... జూన్ నుంచి అమలు! లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకోండి... Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా Amaravati Celebrations: అమరావతి గెలిచింది: గ్రామాల్లో సంబరాలు.. ఢిల్లీలో రాజకీయ కలయికలు! Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.! Nara Lokesh: "ధర్మం గెలిచింది.. అమరావతి నిలిచింది"... మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్! AP Capital: ఇక తిరుగులేదు... అమరావతి తలరాతను మార్చేసిన ఆ 'మూజువాణి ఓటు'! Talliki Vandanam Scheme: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఖాతాల్లోకి రూ.13,000 - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!! New Pensions: కొత్త పెన్షన్ల పంపిణీ... జూన్ నుంచి అమలు! లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకోండి...

Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా

Prajavedhika: మంగళగిరి గ్రీవెన్స్‌లో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరానికి వైసీపీ నేతల భూ కబ్జాలపై పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

Published : 2026-04-02 17:46:00

Politics- వారసత్వ భూమిపై వైసీపీ నేతల కన్ను.. ఐదుగురు ఆడపిల్లల తండ్రి కన్నీటి గాథ.

సర్వే పేరుతో భూమి మాయం! 1 ఎకరా 80 సెంట్లు ఎలా అయ్యింది?

సైనికుడి భూమిని కూడా వదలని కబ్జాదారులు.. చర్చి కట్టేసి దౌర్జన్యం!

Prajavedhika: మంగళగిరి గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ ఆక్రమణల అంశం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా మదిగుబ్బ గ్రామానికి చెందిన గంగవరం నాగరాజు తన గోడును వెళ్లబోసుకుంటూ.. 1994 నుంచి సాగులో ఉన్న తమ భూమిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థానిక వైసీపీ సర్పంచ్ తన పేరు మీద మార్చుకున్నారని ఫిర్యాదు చేశారు. అధికారుల అండతో సర్పంచ్ దౌర్జన్యం చేస్తున్నారని, తమ భూమిని తమకు దక్కేలా చూడాలని కోరారు. అలాగే పల్నాడు జిల్లా యండ్రాయికి చెందిన కర్రి అశోక్.. సర్వే పేరుతో తమ తల్లికి చెందిన ఒక ఎకరా భూమిని 80 సెంట్లుగా చూపిస్తూ వైసీపీ నేతలు మిగిలిన భాగాన్ని కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేటకు చెందిన సోమేజు వెంకటేశ్వర్లు.. ఐదుగురు ఆడపిల్లలు, అనారోగ్యంతో ఉన్న భార్యను సాకుతున్న తనకు వారసత్వంగా వచ్చిన 1.52 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్సీకి వివరించారు. మరోవైపు తెనాలి మండలం పిన్నపాడుకు చెందిన పేనుమర్తి బాలకోటేశ్వరి.. మాజీ సైనికుడైన తన తాతగారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేసి చర్చి, షెడ్లు వేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.

భూ సమస్యలతో పాటు కుటుంబ వివాదాలు కూడా గ్రీవెన్స్‌కు చేరాయి. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వై. హిమబిందు.. తన భర్త యాళ్ల రామ్ కుమార్ వరకట్నం కోసం వేధిస్తూ, నగదు, బంగారం, భూ పత్రాలు తీసుకుని తనను పుట్టింటి వద్ద వదిలేశారని న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ సావధానంగా విన్న ఎమ్మెల్సీ రాజశేఖరం.. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కేవలం భూ సమస్యలే కాకుండా, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా పలువురు అర్జీలు అందజేశారు. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కోసం తమ రెస్యూమ్‌లను సమర్పించగా, అనారోగ్యంతో ఉన్న మరికొందరు ఆర్థిక సాయం కోసం అభ్యర్థించారు. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Spotlight

Read More →