Nadendla Brahmam: మార్గాని భరత్‌పై నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఘాటు వ్యాఖ్యలు! రాజకీయాల్లో వేడెక్కిన విమర్శలు..
Nadendla Brahmam Chowdary: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ పెద్దపిచ్చోడయితే, మార్గాని భరత్ చిన్న పిచ్చోడు..
నారా లోకేష్ కాలి గోటికి సైతం సరితూగని వ్యక్తి భరత్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై స్పందిస్తూ, “జగన్ పెద్ద పిచ్చోడైతే, మార్గాని భరత్ అతన్ని గుడ్డిగా అనుసరించే చిన్న పిచ్చోడు” అంటూ ఘాటుగా విమర్శించారు.
అమరావతి మహిళలు, రైతులు అరసవిల్లి పాదయాత్రగా శాంతియుతంగా వెళుతుంటే, రాజమహేంద్రవరంలో వారిపై జరిగిన దాడిని గుర్తుచేశారు. ఆ ఘటనలో మార్గాని భరత్ పాత్రను ప్రస్తావిస్తూ, “అప్పుడే అతని రాజకీయ జీవితం ముగిసిపోయింది” అని అన్నారు.
మార్గాని భరత్‌ను ఎద్దేవా చేస్తూ, ఆయనను “రీల్స్ స్టార్, ఏకచిత్ర నటుడు, ప్రచారం కోసం ఏదైనా చేసే వ్యక్తి”గా వ్యాఖ్యానించారు. అలాగే, మంత్రి నారా లోకేష్ స్థాయికి కూడా సరితూగని వ్యక్తి అని విమర్శించారు. “లోకేష్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోము” అని హెచ్చరించారు.
రాజధాని అంశంపై కూడా బ్రహ్మం చౌదరి తీవ్రంగా స్పందించారు. ఒకసారి అమరావతి, మరోసారి విశాఖపట్నం, మరొకసారి మూడు రాజధానులు అంటూ నిర్ణయాలు మారుతూ ఉండటం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని అన్నారు. “జగన్ నిర్ణయాలు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి” అంటూ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రతిపాదనలకు పిచ్చోళ్లే మద్దతు ఇస్తారని, సామాన్య ప్రజలు మాత్రం ఈ విధానాలను అంగీకరించడం లేదని ఆయన అన్నారు. “రేపు గోదావరిలో రాజధాని కడతానంటే చప్పట్లు కొట్టే మొదటి వ్యక్తి మార్గాని భరత్” అంటూ ఎద్దేవా చేశారు.
Be the first to react