LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన!

K Kavitha New Party: తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా, అజెండాను వెల్లడించనున్నారు. మహిళా సాధికారత, తెలంగాణ ఉద్యమ ఆశయాలే లక్ష్యంగా ఈ పార్టీ…

AndhraPravasi News Desk 2 min read
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ దిశగా అడుగులు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.

వచ్చే నెల ఏప్రిల్ 25వ తేదీన ఈ కొత్త పార్టీ ఆవిర్భావం జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ వేదికగా పార్టీ జెండాను, అజెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 6 వద్ద సుమారు 20 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కవిత పిలుపునిచ్చారు.

పార్టీ స్థాపన వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు నెరవేరడం లేదని, ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉదని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ సమాజం కోసం, ప్రజా సమస్యలపై నిలదీసే గొంతుకగా తన పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కొత్త తరం నాయకత్వానికి తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా మహిళా సాధికారతకు తన పార్టీ పెద్దపీట వేస్తుందని కవిత వెల్లడించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె నొక్కి చెప్పారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, మార్పు కోరుకునే వారందరూ తనతో కలిసి నడవాలని కోరారు. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక వాట్సాప్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇక ఎన్నికల బరిలో ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. పార్టీ ఆవిర్భావ సభ ముగిసిన తర్వాత కార్యవర్గంతో చర్చించి, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. నిజామాబాద్ కోడలిగా ఇక్కడి నుండే ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందని కవిత పేర్కొన్నారు.  కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…