LIVE
Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  • 
Politics

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయమైన జూన్ 4 తీర్పుకు రెండేళ్లు!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జూన్ 4, 2024 ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

AndhraPravasi News Desk 1 min read
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయమైన జూన్ 4 తీర్పుకు రెండేళ్లు!

జూన్ 4, 2024 ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మార్గదర్శకం..

ప్రజల విశ్వాసమే మా బలం.. అభివృద్ధి పథంలో ఏపీ: ప్రభుత్వం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జూన్ 4, 2024 ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రజలు ఇచ్చిన అపూర్వమైన తీర్పుకు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని వెల్లడించింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, ఆ విజయం కేవలం అధికారాన్ని అందించిన ఫలితం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొంది. ప్రజలు అప్పగించిన ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపింది.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొంటూ, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా పాలన కొనసాగుతోందని వెల్లడించింది.

అసమానతలు లేని సమాజ నిర్మాణం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంది. ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యతగా భావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును గౌరవించేలా, వారు గర్వపడే విధంగా పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామని ప్రభుత్వం పేర్కొంది. "జై ఆంధ్రప్రదేశ్" అంటూ తన సందేశాన్ని ముగించింది.

Be the first to react

More Coverage

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…