LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు!

India New Zealand FTA: భారత్ న్యూజిలాండ్ మధ్య ఏప్రిల్ 24న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదరనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతులకు పన్ను మినహాయింపులు లభించడమే కాకుండా, యోగా, ఐటీ హెల్త్‌కేర్ రంగాల నిపుణులకు ప్రతి ఏటా 5,000 ప్రత్యేక వీసాలు లభిస్తాయి.

AndhraPravasi News Desk 2 min read
India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు!

India New Zealand FTA: భారత్  న్యూజిలాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది అయిందన్న విషయం అందరికి తెలిసినవే. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలోనే చర్చలు ముగియగా, ఇప్పుడు అధికారికంగా దీనికి రూపకల్పన చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని రెట్టింపు చేసి, సుమారు 5 బిలియన్ డాలర్లకు చేర్చడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ ఒప్పందం వల్ల మన దేశంలోని ఎగుమతిదారులకు భారీ ఊరట కలగనుంది. భారత్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే అన్ని వస్తువులపై ఎటువంటి పన్నులు  ఉండవు. దీనివల్ల మన దేశ వస్తువులకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో, రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇండియాకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతాన్ని ఇస్తుంది.

న్యూజిలాండ్ నుంచి వచ్చే ఉన్ని, కలప, బొగ్గు వంటి వస్తువులపై భారత్ పన్నులు తగ్గించనుంది. అయితే, మన దేశ రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, చీజ్), ఉల్లిపాయలు, చక్కెర, నూనెలు  రబ్బరు వంటి వాటిపై ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. దీనివల్ల స్థానిక రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

సేవా రంగంలో కూడా ఈ ఒప్పందం కీలక మార్పులు తీసుకురానుంది. భారతీయ నిపుణుల కోసం న్యూజిలాండ్ ప్రతి ఏటా 5,000 వీసాలను ప్రత్యేకంగా కేటాయించనుంది. ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాలతో పాటు యోగా ఇన్స్ట్రక్టర్లు, ఆయుష్ నిపుణులు, భారతీయ వంట మాస్టర్లు  సంగీత ఉపాధ్యాయులకు అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. మూడు ఏళ్ల పాటు అక్కడ ఉండి పని చేసుకునే వెసులుబాటు ఈ ఒప్పందం కల్పిస్తోంది.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య వ్యాపారం కేవలం 1.3 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. ఐటీ  పర్యాటక రంగం కలిపితే ఇది 2.4 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ కొత్త ఒప్పందంతో వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. ఏప్రిల్ 24న జరిగే ఈ కార్యక్రమం ద్వారా భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో మరో ముందడుగు వేయబోతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…