Polavaram: పోలవరానికి కేంద్ర నిధుల వెల్లువ... దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం! Steel Bridge: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీ మార్పులు! 70 కోట్లు.. 88 గడ్డర్లు.. మరో 15 రోజులు మాత్రమే! Chandrababu: "ఏపీ పల్లెల్లో జాతీయ వెలుగులు".. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులపై సీఎం హర్షం.! Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.! Nara Lokesh: అవకాశవాదులకు నో ఎంట్రీ.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ.. కష్టపడే కార్యకర్తలకు - బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు! Varla Ramaiah: జగన్ గారూ.. బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకోండి, మీ తప్పుడు ఆలోచనలకు స్వస్తి చెప్పండి! Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Polavaram: పోలవరానికి కేంద్ర నిధుల వెల్లువ... దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం! Steel Bridge: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీ మార్పులు! 70 కోట్లు.. 88 గడ్డర్లు.. మరో 15 రోజులు మాత్రమే! Chandrababu: "ఏపీ పల్లెల్లో జాతీయ వెలుగులు".. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులపై సీఎం హర్షం.! Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.! Nara Lokesh: అవకాశవాదులకు నో ఎంట్రీ.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ.. కష్టపడే కార్యకర్తలకు - బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు! Varla Ramaiah: జగన్ గారూ.. బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకోండి, మీ తప్పుడు ఆలోచనలకు స్వస్తి చెప్పండి! Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా..

Steel Bridge: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీ మార్పులు! 70 కోట్లు.. 88 గడ్డర్లు.. మరో 15 రోజులు మాత్రమే!

Steel Bridge: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనులు గడ్డర్ల అమరిక మరియు స్లాబ్ పనులతో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వంతెన పూర్తికావడం వల్ల ప్రకాశం బ్యారేజ్ మరియు మంగళగిరి వైపు నుండి అమరావతికి ప్రయాణించే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోతాయి.

Published : 2026-04-01 06:58:00

Politics- రికార్డు స్థాయిలో స్టీల్ బ్రిడ్జ్ పనులు: 15 రోజుల్లో 31 గడ్డర్లు ఫిక్స్!

త్వరలో అమరావతికి ఈజీ యాక్సెస్.. స్టీల్ బ్రిడ్జ్ పనులు స్పీడప్.

బకింగ్‌హామ్ కెనాల్‌పై సాహసోపేతంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం.

Steel Bridge: అమరావతి రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భాగంగా గడ్డర్ల అమరిక ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోంది. మొత్తం 88 గడ్డర్లకు గానూ ఇప్పటికే 70 గడ్డర్ల ఫిక్సింగ్ పూర్తయింది. కేవలం గత 15 రోజుల్లోనే సుమారు 31 గడ్డర్లను అమర్చడం విశేషం. మిగిలిన 18 గడ్డర్లను కూడా త్వరలోనే అమర్చేందుకు ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు. 

వార్ధికి ఎడమ వైపున (LHS) గడ్డర్ల అమరికతో పాటు డక్ షీట్ల ఏర్పాటు పనులు కూడా ముగిశాయి. ప్రస్తుతం అక్కడ రీఇన్ఫోర్స్మెంట్ (ఇనుప కడ్డీల అమరిక) పనులు జరుగుతున్నాయి. రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే ఎల్హెచ్ఎస్ వైపు కాంక్రీట్ స్లాబ్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం సుమారు 400 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించనున్నారు. స్లాబ్ మందం 250 మి.మీ వరకు ఉండబోతోంది. 

మరోవైపు మంగళగిరి రోడ్డు వైపు (RHS) పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే, పీర్ క్యాప్ నిర్మాణం పూర్తి కాకముందే భారీ క్రేన్ల సహాయంతో గడ్డర్లను అమరుస్తున్నారు. 500 టన్నుల సామర్థ్యం గల మొబైల్ క్రేన్ కదలికలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గడ్డర్లు అమర్చిన తర్వాత పీర్ క్యాప్ పనులు పూర్తి చేస్తారు. 

ఈ వంతెన నిర్మాణంలో బేరింగ్ల పాత్ర అత్యంత కీలకం. గడ్డర్ల కింద ప్రత్యేకమైన మెటాలిక్ బేరింగ్లను అమర్చుతున్నారు. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు వచ్చే ఒత్తిడిని మరియు లోడ్‌ను ఈ బేరింగ్లు గ్రహించి ఫౌండేషన్‌కు సమానంగా పంపిణీ చేస్తాయి. దీనివల్ల వంతెన చాలా ధృడంగా ఉంటుంది. వాహనాలు వెళ్లేటప్పుడు స్వల్పమైన కదలికలు (vibrations) ఉన్నప్పటికీ, అది వంతెన భద్రతకు అవసరమైన ప్రక్రియ అని నిపుణులు తెలుపుతున్నారు.

సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్.సి.సి (NCC) మరియు భీమా సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. మొత్తం 128 మీటర్ల పొడవుతో నాలుగు వరుసల వంతెనగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. 

Spotlight

Read More →