Chandrababu: "ఏపీ పల్లెల్లో జాతీయ వెలుగులు".. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులపై సీఎం హర్షం.! Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.! Nara Lokesh: అవకాశవాదులకు నో ఎంట్రీ.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ.. కష్టపడే కార్యకర్తలకు - బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు! Varla Ramaiah: జగన్ గారూ.. బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకోండి, మీ తప్పుడు ఆలోచనలకు స్వస్తి చెప్పండి! Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! Chandrababu: "ఏపీ పల్లెల్లో జాతీయ వెలుగులు".. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులపై సీఎం హర్షం.! Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.! Nara Lokesh: అవకాశవాదులకు నో ఎంట్రీ.. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ.. కష్టపడే కార్యకర్తలకు - బెదిరింపులకు దిగితే కఠిన చర్యలు! Varla Ramaiah: జగన్ గారూ.. బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకోండి, మీ తప్పుడు ఆలోచనలకు స్వస్తి చెప్పండి! Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.!

Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.!

Chandrababu: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ చేసే కార్యక్రమాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ వేగవంతం చేసింది. తడి చెత్త, పొడి చెత్త ప్రాసెస్ చేసే షెడ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేందుకు ఆయా ఏజన్సీల ప్రతినిధులతో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం అమరావతిలోని కార్పోరేషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

Published : 2026-03-31 21:00:00
  • ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ కేంద్రాలపై స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ప్రత్యేక శ్రద్ధ..
     
  • సత్వరం పనులు చేపట్టాలని  ఏజన్సీలకు చైర్మన్ పట్టాభిరామ్ ఆదేశాలు..

Chandrababu: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు  ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ చేసే కార్యక్రమాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ వేగవంతం చేసింది. తడి చెత్త, పొడి చెత్త ప్రాసెస్ చేసే షెడ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేందుకు ఆయా ఏజన్సీల ప్రతినిధులతో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్  మంగళవారం  అమరావతిలోని కార్పోరేషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు.  గృహ, వాణిజ్య వ్యర్థాల నుంచి ప్లాస్టిక్,  కాగితం, లోహాలు, గాజు వంటి వస్తువులను వేరు చేసి, శుద్ధి చేసి, ప్యాక్ చేసి, రీసైక్లింగ్ పరిశ్రమలకు విక్రయించే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ కేంద్రాల ఏర్పాటుకు కావలసిన భూమి సమకూర్చడం, స్టోరేజీ ట్యాంకులు,  షెడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.  ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ కేంద్రాలలో తయారయ్యే కంపోస్ట్ ని వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అందజేస్తారు. వేరుచేసిన ప్లాస్టిక్, ఇతర పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్స్‌కు పంపుతారు. 

మొత్తం 107 నగరాలు, పట్టణాలలో 58 చోట్ల ఈ కేంద్రాల ఏర్పాటుకు కావలసిన భూమి అందుబాటులో ఉన్నట్లు చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో కూడా మున్సిపల్ కమిషనర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి త్వరితగతిన భూమి కేటాయించేలా చూస్తామని చెప్పారు.  మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ఈ కేంద్రాలకు విద్యుత్, నీరు, రోడ్ల సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు.  ఏజన్సీల ప్రతినిధులు భూముల స్వాధీనం విషయమై ఆయా కమిషనర్లు, రీజినల్ డైరెక్టర్లను కలిసి, సమన్వయంతో పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.  భూములు కేటాయించిన ప్రాంతాలలో వెంటనే  సాయిల్ టెస్ట్ చేయమని చెప్పారు. వేగంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. ఈ యూనిట్లలో వినియోగించే మిషనరీలను మంచి పేరున్న కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. 
తొలుత కార్పోరేషన్ అధికారులు ఎంఆర్ఎఫ్ కేంద్రాలు, షెడ్ల నిర్మాణం ఎలా ఉండాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో మొత్తం 10 ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Spotlight

Read More →