LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Google: గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖకు కొత్త దిశ.. ‘డేటా సిటీ’గా.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

Google: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించనుందని ఆయన తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Google: గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖకు కొత్త దిశ.. ‘డేటా సిటీ’గా.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

గూగుల్ తో భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చింది..

ఈ రోజు నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తోంది..

విశాఖపట్నం: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం సంపాదించనుందని ఆయన తెలిపారు.

భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం గర్వకారణమని లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలులో అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్ట్రా సంస్థలు అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు, ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రత్యేకంగా నమస్కారం తెలిపారు.

“ఈ రోజు నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక కొత్త చరిత్రను ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు ఉక్కు నగరంగా పేరున్న విశాఖ ఇకపై ‘డేటా సిటీ’గా మారుతుంది” అని మంత్రి స్పష్టం చేశారు. ఏఐ డేటా సెంటర్‌తో ప్రపంచ స్థాయి టెక్నాలజీ రంగంలో విశాఖ పేరు మారుమోగుతుందని చెప్పారు.

గతంలో సైబరాబాద్‌ను హైటెక్ సిటిగా మార్చిన అనుభవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉందని, అదే దిశలో ఇప్పుడు విశాఖలో కూడా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వేగంగా వస్తుండటం ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.

దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందున ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సాధ్యమవుతోందని లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని తెలిపారు.

ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెకానికల్ వంటి విభిన్న రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని వివరించారు.

“మా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని విధానంతో పాటు క్లస్టర్ ఆధారిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నాం” అని మంత్రి చెప్పారు.

కొన్ని వర్గాలు అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించిన లోకేష్, అయినా కూడా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టిన గూగుల్, అదానీ, ఎయిర్‌టెల్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో విశాఖ ప్రాంతాన్ని తొలి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…