LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Atchennaidu: ఖరీఫ్‌ రైతుకు అండగా ప్రభుత్వం.. విత్తనాలు, ఎరువులు, నీటితో పూర్తి సన్నద్ధత!

Atchennaidu: రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Atchennaidu: ఖరీఫ్‌ రైతుకు అండగా ప్రభుత్వం.. విత్తనాలు, ఎరువులు, నీటితో పూర్తి సన్నద్ధత!

రైతులకు సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు, సాగునీరు..

ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ రంగానికి పూర్తి మద్దతు..

అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, మే 15 నుంచే దశలవారీగా సాగునీటి విడుదల ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. 2026-27 సంవత్సరానికి రూ.294 కోట్ల బడ్జెట్‌తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై రైతులకు అందించనున్నారు.

పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు 93 వేల క్వింటాళ్లు – 50% రాయితీ
ఇప్పటికే 30 వేల క్వింటాళ్లు సిద్ధం
వేరుశనగ విత్తనాలు 2.20 లక్షల క్వింటాళ్లు – 40% రాయితీ (మే 20 నుంచి పంపిణీ)
వరి విత్తనాలు 1.62 లక్షల క్వింటాళ్లు – మే 15 నుంచి పంపిణీ
చిరుధాన్యాలు, అపరాలు – జూన్ 15 నుంచి అందుబాటులో

అన్ని విత్తనాలను నాణ్యతా పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త విత్తన రకాల అభివృద్ధికి సవరించిన సమగ్ర పథకం అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి
2026-27 లక్ష్యం: 1,20,678 క్వింటాళ్లు
రాయితీలు – రైతులకు పెద్ద ఊరట

ప్రభుత్వం పలు పంటలపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తోంది:
వరి విత్తనాలకు రూ.500–1000 వరకు రాయితీ
చిరుధాన్యాలు – 50%
పప్పుధాన్యాలు – 30%
శనగ – 25%
వేరుశనగ, నువ్వులు – 40%
పచ్చిరొట్ట విత్తనాలు – 50%
గిరిజన రైతులకు 90% వరకు, ప్రకృతి విపత్తుల సమయంలో 80% వరకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు.
ఎరువుల కొరత లేదు

ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
మొత్తం కేటాయింపు: 18.09 లక్షల మెట్రిక్ టన్నులు
ప్రస్తుతం అందుబాటులో: 8.84 లక్షల మెట్రిక్ టన్నులు
నిల్వలు: 7.77 లక్షల మెట్రిక్ టన్నులు

యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పీ ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించారు.
మే 15 నుంచి దశలవారీగా నీటి విడుదల
జూన్ నుంచి ఖరీఫ్ సాగు ప్రారంభం

ప్రాజెక్టుల పరిస్థితి:
గోదావరి డెల్టా: 51.67 టీఎంసీలు నీరు
కృష్ణా డెల్టా (పులిచింతల): 24.43 టీఎంసీలు
ఉత్తరాంధ్ర: 9.22 టీఎంసీలు
నాగార్జునసాగర్: 27.07 టీఎంసీలు

కాలువల మరమ్మతులు, శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా నీటి విడుదల తేదీలు నిర్ణయిస్తున్నారు.

గత రెండేళ్లలో రికార్డు సాగు
2025-26 ఖరీఫ్: 99.35 లక్షల ఎకరాలకు సాగునీరు
2024-25 ఖరీఫ్: 96.22 లక్షల ఎకరాలు

గోదావరి, కృష్ణా డెల్టాలు, నాగార్జునసాగర్, వంశధార వంటి ప్రధాన ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందింది.

విత్తనాలు, ఎరువులు, సాగునీటి సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు పూర్తి మద్దతు అందిస్తాయని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు నమ్మకంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…