AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!!

Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక! రూ.33,630 కోట్ల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష!

2025-10-28 06:58:00
Security Highway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, ఏపీ మధ్య మొట్టమొదటి స్మార్ట్ రోడ్డు.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైవే అప్‌గ్రేడ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి రవాణా వ్యవస్థ కీలకమని భావించిన ఆయన, కొత్త రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునికీకరణ, పోర్టులకు రైల్వే కనెక్టివిటీ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనల ప్రకారం మూలపేట, విశాఖపట్నం, రామాయపట్నం వంటి నూతన పోర్టులను రైల్వేతో అనుసంధానం చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. కనెక్టివిటీ పెరుగడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారం, మరియు ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Moneyview Hack : మనీవ్యూ కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు!

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు, రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పార్క్ ఏర్పాటుతో రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని, ఉత్పత్తులను దేశంలోని ఇతర రాష్ట్రాలకు తేలికగా రవాణా చేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

Bhagavad Gita: అమంగళం శాంతించు గాక... గీతా తత్వం జీవన సత్యంగా మారాలంటే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -45!

ప్రస్తుతం రాష్ట్రంలో రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. గుంటూరు–గుంతకల్, నడికుడి–శ్రీకాళహస్తి, గుణదల–ముస్తాబాద్ బైపాస్, రేణిగుంట–రాయదుర్గం వంటి ప్రధాన లైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని కనెక్టివిటీకి సంబంధించి హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ప్రతిపాదనలను కూడా సమీక్షించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెడుతుందని ఆయన అన్నారు.

Iphone 16: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇప్పుడే బెస్ట్ టైమ్! అమెజాన్ లో ఇంకా కొనసాగుతున్న కొనసాగుతున్న పండుగ ఆఫర్లు!

అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. చెన్నై–బెంగళూరు హై స్పీడ్ కారిడార్‌లో తిరుపతిని కూడా కలుపాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా 1564 కిలోమీటర్ల రైల్వే మార్గాల పనులను వేగవంతం చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. అమరావతి–గన్నవరంలో నూతన రైల్వే టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయింపును ఆమోదించారు. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ పనులు, కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్! ఈ రూట్లో 43 రైళ్లు రద్దు!

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్లను ఐకానిక్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తిరుపతి స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం స్కైవాక్ నిర్మించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఆధునికీకరణ పనులను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Amaravati Expressway: స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు కొత్త ఊపు..! ఎలివేటెడ్ కారిడార్‌తో ఆధునిక రూపు..!
Digital Dwarka: డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు చెక్..! స్మార్ట్ యాప్‌లతో కొత్త మార్పు..!
APSRTC మెగా నోటిఫికేషన్.. వివిధ జిల్లాల్లో 277 పోస్టులు ఖాళీ.. లాస్ట్ డేట్ - రాత పరీక్ష లేకుండానే ఎంపిక! త్వరపడండి!
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు.. మీ జేబుకు చిల్లు పడే 5 మార్పులివే!
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత త్వరలోనే విడుదల! అకౌంట్‌లోకి ₹2,000 రావాలంటే ఇది తప్పనిసరి!

Spotlight

Read More →