LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదవడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.

AndhraPravasi News Desk 1 min read
West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు!

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న రాజకీయ వేడి..

అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదవడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అభిషేక్ బెనర్జీ చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయని, ఆయన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో కూడా అవి ప్రచారం అయ్యాయని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, మరో కీలక పరిణామంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో మాజీ కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో తీవ్రమైన విధానపరమైన లోపాలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

2024 ఆగస్టులో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై వైద్యులు, పౌరసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తులో పారదర్శకత ఉండాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి.

ఈ రెండు పరిణామాలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఒకవైపు అధికార పార్టీ నేతపై కేసు నమోదు కావడం, మరోవైపు అత్యంత సంచలనాత్మక కేసులో ఉన్నతాధికారుల సస్పెన్షన్ చోటుచేసుకోవడం రాష్ట్రంలో రాజకీయ చర్చలకు దారితీస్తోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…