Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి..
Prajavedhika: విజయనగరంకు చెందిన లియోనీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తన తల్లి విశాఖపట్నంలోని క్వీన్స్ మేరీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1993లో మరణించారు.
- రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మీ నాయుడు..
- Politics: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..
Prajavedhika: విజయనగరంకు చెందిన లియోనీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తన తల్లి విశాఖపట్నంలోని క్వీన్స్ మేరీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1993లో మరణించారు. ఆమె మరణానంతరం వచ్చిన సర్వీస్, డెత్ బెనిఫిట్స్ డబ్బుతో తన తండ్రి (సలాది ముత్యాల రాయుడు) విజయనగరంలో సుమారు 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2020లో తండ్రి మరణించిన తర్వాత, అతని రెండో భార్య కుమార్తెలు తప్పుడు సమాచారంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొంది ఆ భూమిని హస్తగతం చేసుకోవాలని చూశారు. అయితే తమ ఫిర్యాదుతో విచారణ జరిపిన విజయనగరం ఎమ్మార్వో గారు ఆ తప్పుడు సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. దీనితో ఈ 50 ఎకరాలపై తమకే పూర్తి లీగల్ వారసత్వ హక్కులు స్థిరపడ్డాయి. తాము స్థానికంగా ఉండకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, విజయనగరం ఇప్పిలి వీధికి చెందిన రియల్టర్ అప్పలరాజు రంగంలోకి దిగాడు. తనకు సాయం చేస్తానని నమ్మబలికి, తమ వద్ద నుండి పలు ఖాళీ కాగితాలు, నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నాడు.
అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన అప్పటి ప్రముఖ పెద్దలు, ముఖ్య నేతల రాజకీయ అండతో ఆ సంతకాలను ఫోర్జరీ చేసి తమకి తెలియకుండానే ఆ 50 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించాడు. ఈ భూదందా కేవలం 50 ఎకరాలతో ఆగలేదు. అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి ప్రభుత్వ భూములు, పంట కాలువలు, చిన్నచిన్న చెరువులను కూడా అడ్డగోలుగా ఆక్రమించారు. మొత్తం 80 ఎకరాల విస్తీర్ణంలో "A.R. గ్రాండ్" పేరుతో ఎలాంటి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతులు లేకుండా, చట్టవిరుద్ధంగా భారీ లేఅవుట్ వేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఈ అక్రమ లేఅవుట్ ద్వారా దాదాపు 700 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని, ప్రైవేటు ఆస్తిని దోచుకోవడానికి స్కెచ్ వేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మీ నాయుడులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన కుళ్లాయమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తాతల కాలం నుండి వస్తున్న భూమి కలదు. సర్వే నంబర్లు 164/c 165/cలో ఉన్న ఈ భూమికి సంబంధించిన అసలైన రిజిస్టర్ పత్రాలు ఇప్పటికీ తమ పేరిటే ఉన్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ భూమిని సాగు చేసుకుంటున్నది కూడా తామే. అయితే గత 8 సంవత్సరాల క్రితం మాసినేని రామయ్య అనే వ్యక్తి పొరుగువారి భూమిని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. దీనికి తోడు అప్పటి స్థానిక తహశీల్దారు గారు నిందితుడి వద్ద భారీగా లంచం తీసుకుని, తమ వైపు నుండి ఎలాంటి సంతకాలు లేదా సమ్మతి పత్రాలు లేకపోయినప్పటికీ, ఆన్‌లైన్ రికార్డులలో తప్పుడు వివరాలను ఎక్కించి అక్రమార్కులకు సహకరించారు. ఈ అన్యాయంపై న్యాయం చేయాలంటూ గత 7 సంవత్సరాలుగా స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. అక్కడ స్పందన లేకపోవడంతో గత ఒక సంవత్సర కాలంగా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కలిసి ఎన్నో అర్జీలు సమర్పించాను. అయినా ఉన్నతాధికారుల నుండి కూడా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి గానీ, న్యాయం గానీ జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాకినాడ జిల్లా రౌతులపూడికి చెందిన జిగిరెడ్డి మహాలక్ష్మి నాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలోని సర్వే నంబర్ 506 లో తనకు ఒక ఎకరం భూమి కలదు. గతంలో ఈ భూమిని "శ్రీ వేద UP స్కూల్" నడుపుకోవడానికి గుంటూరుకు చెందిన వారికి రిజిస్టర్డ్ లీజుకు ఇచ్చాను. సుమారు 4 సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం మారింది. దాంతో పాత యాజమాన్యంతో కుదుర్చుకున్న సదరు రిజిస్టర్డ్ లీజును చట్టబద్ధంగా రద్దు చేసుకున్నాను. కానీ ప్రస్తుతం ఆ స్కూల్‌ను నడుపుతున్న కొత్త యాజమాన్యం వారు తన స్థలానికి సంబంధించి తనతో ఎటువంటి రిజిస్టర్డ్ లీజు ఒప్పందం చేసుకోలేదు. పైగా తనకు ఎటువంటి అద్దె కూడా ఇవ్వడం లేదు. ఎలాంటి హక్కులు లేకపోయినా, దౌర్జన్యంగా, అక్రమంగా తన భూమిని ఆక్రమించుకుని స్కూల్ నడుపుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ మామగారైన కురుబ బోదన్నకు 1967లో సర్వే నంబర్ 450-2 లోని 4.84 ఎకరాల భూమిని ప్రభుత్వం డి-పట్టాగా మంజూరు చేసింది. కంబదూరు రెవెన్యూ రికార్డులలో పట్టా నెం. 1698గా నమోదైన ఈ భూమిలో తమ కుటుంబం గత 60 సంవత్సరాలుగా శాంతియుతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. ఆస్తిపై కన్నేసిన కొందరు వ్యక్తులు స్థానిక తహశీల్దార్ ఆఫీస్ అధికారులతో కుమ్మక్కయ్యారు. గత ఏడాది ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని సగానికి విభజించి (సర్వే నం. 450-2 లోని 2.42 ఎకరాలకు) పట్టా నం. 870 పేరుతో దొంగ పట్టాలు సృష్టించారు. ఈ దొంగ పట్టాలను అడ్డం పెట్టుకుని వి. వీరాంజనేయులు, వి. శ్రీరంగరాజులు, వడ్డే గంగాధర్, వి. వెంకటేశులు అనే వ్యక్తులు ఏకమై తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. "భూమిలో సగం భాగం వదిలిపెట్టాలి" అంటూ దౌర్జన్యానికి దిగారు. ఎదురు తిరగడంతో ఆగ్రహం చెందిన సదరు వ్యక్తులు కర్రలు, సైకిల్ చైన్లతో తనను తన కుమారుడిని ఇష్టానుసారంగా కొడుతూ ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
గుంటూరుకు చెందిన ఉమాసాయి ప్రియ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తెనాలి మండలం అంగులకుదురు గ్రామానికి చెందిన బెజవాడ ప్రకాశ్ అనే వ్యక్తి, తన తల్లి క్యాన్సర్ వ్యాధితో చావుబతుకుల్లో ఉందని, అత్యవసరంగా డబ్బులు కావాలని తనను నమ్మించాడు. తన వద్ద ఉన్న ఒక బంగారపు గొలుసు, రెండు గాజులు, చెవి దిద్దులు (సుమారు 70 గ్రాముల బంగారం) తీసుకుని.. గుంటూరు బ్రాడీపేటలోని 'కల్పన ఫైనాన్స్' లో బలవంతంగా తాకట్టు పెట్టించాడు. ఆ తాకట్టు ద్వారా వచ్చిన డబ్బును తీసుకుని నిందితుడు బెజవాడ ప్రకాశ్ పరారయ్యాడు. ఈ మోసంపై గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నాను. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ నందు ది. 08-09-2025న FIR నెం. 337/2025 ప్రకారం కేసు నమోదైంది. అయితే కేసు నమోదై 8 నెలలు గడుస్తున్నా నగరపాలెం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో తీవ్ర కాలయాపన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా.. నిందితుడు బెజవాడ ప్రకాశ్‌ను విచారించామని, కేసును రీ-ఓపెన్ చేశామని కాలక్షేపపు మాటలు చెబుతూ పోలీసులు తప్పించుకుంటున్నారే తప్ప, ఇప్పటివరకు బంగారాన్ని రికవరీ చేయలేదు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన కుమారి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తల్లిదండ్రులు లేని విషయాన్ని ఆసరాగా చేసుకుని సొంత అన్నయ్య, వదిన కలిసి తండ్రి ఆస్తిని పూర్తిగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తున్నారు. చట్టప్రకారం ఈ వారసత్వ ఆస్తిలో అక్క, అన్నయ్య, తనకు సమాన వాటాలు రావాల్సి ఉంది. కానీ తన రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతున్నందున, అన్నయ్య పేరు మీద జరగబోయే అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే నిలిపివేయాలని కోరారు. అలాగే తమ తండ్రి మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) కోసం గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బులు ఖర్చవుతున్నాయే తప్ప పని కావడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కర్నూలుకు సల్కాపురం నరేంద్రబాబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. నగరంలోని జోహరాపురం ఏరియాలో గల సర్వే నెంబర్లు 155, 156, 157 లలో ప్రభుత్వం గతంలో బీడీ కార్మికులైన తమకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసింది. అందులో భాగంగా తమ తల్లి అయిన యస్. నర్సమ్మ గారికి ప్లాట్ నెంబర్: 108 గల స్థలం పట్టాను కేటాయించారు. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల ది. 10.04.2015 న మరణించారు. తల్లి మరణించిన తర్వాత, ఆమె వారసుడిగా తనకు ఆ ప్లాటును తన పేరు మీదకు మార్చవలసిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఫైల్ కర్నూలు తహశీల్దారు గారి కార్యాలయానికి చేరింది. అయితే విచారణలో భాగంగా తహశీల్దారు గారు ఒరిజినల్ పట్టాను సమర్పించాలని కోరారు. కానీ సదరు ఒరిజినల్ పట్టా ప్రస్తుతం తన వద్ద లేదు. గతంలో గృహ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఆ ఒరిజినల్ పట్టాను గృహనిర్మాణ శాఖ అధికారులు తీసుకుని వారి వద్దే ఉంచుకున్నారు. గృహనిర్మాణ శాఖ కార్యాలయం నుండి ఆ ఒరిజినల్ పట్టా బయటకు వస్తేనే గానీ, రెవెన్యూ అధికారులు పట్టా బదిలీ చేయలేమని చెబుతుండటంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.
Be the first to react