LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Mahanadu: వర్చువల్ మహానాడుకు రికార్డు స్పందన.. 7.5 లక్షల మంది హాజరు.. సీఎం చంద్రబాబు హర్షం!

Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడు తొలి రోజు కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Mahanadu: వర్చువల్ మహానాడుకు రికార్డు స్పందన.. 7.5 లక్షల మంది హాజరు.. సీఎం చంద్రబాబు హర్షం!

హైబ్రిడ్ మహానాడుకు అపూర్వ స్పందన.. 7.5 లక్షల మంది పాల్గొనడం చరిత్ర..

మహిళలకు 33% రిజర్వేషన్ ప్రతిపాదనకు నేతల మద్దతు..

అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు తొలి రోజు కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహానాడు తొలి రోజు నిర్వహణపై పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి ఇంచార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి సుమారు 7.5 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు వర్చువల్‌గా పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టమని సీఎం పేర్కొన్నారు. ఈ స్థాయిలో కార్యకర్తల భాగస్వామ్యం పార్టీ బలాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తోందన్నారు. వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహణ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మహానాడు అనేది కేవలం పార్టీ సమావేశం కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. మహానాడు వేదికగా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసి ప్రత్యర్థి పార్టీలు ఆందోళన చెందుతున్నాయని వ్యాఖ్యానించారు.

మహానాడులో కార్యకర్తల ప్రసంగాలు విన్నప్పుడు సాధారణ కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదగాలనే తపనతో పనిచేస్తున్నారని అర్థమైందన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను ఆమోదించాలని పలువురు నాయకులు కోరారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. రేపటి మహానాడులో కీలక తీర్మానాలు, ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ కుటుంబ సభ్యులంతా చురుకుగా పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…