LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

TDP: కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన సీఎం చంద్రబాబు! ప్రభుత్వ పథకాలపై చర్చలు!

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

AndhraPravasi News Desk 2 min read
TDP: కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన సీఎం చంద్రబాబు! ప్రభుత్వ పథకాలపై చర్చలు!

దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు.. వంటి అంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..

సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పించుకోవాలి..

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. టీడీపీలో కార్యకర్తలే నిజమైన అధినేతలని, వారు గౌరవంగా “రైట్ రాయల్‌గా” జీవించాలని అన్నారు. పార్టీ కూడా కార్యకర్తలను అదే స్థాయిలో గౌరవిస్తుందని చెప్పారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన సీఎం, సమకాలీన రాజకీయాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్రిమినల్స్‌తో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. “కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలి” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి, సమర్థంగా కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రజలను రెచ్చగొట్టడం, రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించడం, తర్వాత చర్యలు తీసుకుంటే రాజకీయంగా మలచడం వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. “రప్పా రప్పా” అంటూ హింసకు ప్రోత్సహిస్తారని, అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని విమర్శించారు. అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ పరామర్శలకు వెళ్తారని, కానీ వాస్తవానికి కార్యకర్తలనే కార్ల కింద తొక్కించి చంపించే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.

కడపలో జరిగిన పార్టీ కార్యకర్త హత్యను ఉదాహరణగా ప్రస్తావించిన సీఎం, అక్కడి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, అలాగే రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారని ఆరోపించారు. ఆస్తుల పంపకాలలో తలెత్తిన విభేదాల కారణంగానే దస్తగిరి హత్య జరిగిందని తెలిపారు.

అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రవర్తనను ప్రస్తావిస్తూ, సాక్షులను బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనలు ప్రజల్లోకి తీసుకెళ్లి నిజాలను తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. “గొడ్డలి పార్టీ అరాచకాలను నిరంతరం ప్రజలకు వివరించాలి” అంటూ సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి, ప్రజలతో దగ్గరగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…