LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.!

Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను నిర్మించి దేశానికి ఒక టెక్నాలజీ రాజధానిని అందించిన తనకు, రాష్ట్ర విభజన అనంతరం అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అద్భుతమైన అవకాశం దక్కిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని, అమరావతిని కేవలం ఒక…

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.!
  • Politics: గ్రీన్ ఎనర్జీ, ఏఐ, జనాభా నిర్వహణ వంటి భవిష్యత్ ప్రణాళికలను వివరించిన చంద్రబాబు..
     
  • సైబరాబాద్ తర్వాత అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అవకాశం దక్కిందని వెల్లడి ..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వేదికగా తన దార్శనికతను చాటుకున్నారు. 'ఎకనమిక్ టైమ్స్' వార్షిక పురస్కారాల వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 'బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025' అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం పారిశ్రామిక దిగ్గజాలను ఆలోజింపజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను నిర్మించి టెక్నాలజీ రంగంలో దేశానికి దిశానిర్దేశం చేసిన తనకు, ఇప్పుడు నవ్యాంధ్రలో అమరావతిని 'ఫ్యూచర్ సిటీ'గా తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశం దక్కడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అమరావతిని కేవలం ఇటుకలతో నిర్మించే రాజధానిగా కాకుండా, పర్యావరణ హితమైన 'గ్రీన్-బ్లూ' సిటీగా, నెట్-జీరో కార్బన్ కాన్సెప్టుతో హైదరాబాద్‌ను మించిన 'హైదరాబాద్ ప్లస్' నగరంగా నిర్మిస్తామని ఆయన ప్రతినబూనారు.

సంస్కరణల ద్వారానే సంపద సృష్టి సాధ్యమని, ఆ సంపదతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందించగలమని చంద్రబాబు విశ్లేషించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వచ్చిన మార్పులను వివరిస్తూ, 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు. ప్రధాని మోదీ నిర్దేశించిన '2047 వికసిత్ భారత్' లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందని, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు ఈ నెల 28న శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించి పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం నింపారు.

కేవలం ఆర్థికాభివృద్ధికే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతతో కూడిన సంక్షేమం గురించి కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది ధనవంతులు, పేదరికంలో ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకుని ఆదుకునేలా 'ఎంబీకే 10-20' (పీ4) ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు. అలాగే, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటును దృష్టిలో ఉంచుకుని 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ'ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, జనాభా ఉన్న దేశాలే భవిష్యత్తులో సంపన్న దేశాలుగా నిలుస్తాయని తన వినూత్న ఆలోచనను పంచుకున్నారు. టెక్నాలజీ, సంక్షేమం, భవిష్యత్ జనాభా నిర్వహణల మేళవింపుతో చంద్రబాబు ఆవిష్కరించిన ఈ విజన్ ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతుందనడంలో సందేహం లేదు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…