LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: ఏపీసీఎండీసీపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రానికి చంద్రబాబు లేఖ! రక్షణ, అణుశక్తి వైద్య రంగాలకు..

Chandrababu Letter To Union Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) పరిధిలోని మంగంపేట ముగ్గురాయి (బెరైట్స్) గనుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని భావిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల…

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: ఏపీసీఎండీసీపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రానికి చంద్రబాబు లేఖ! రక్షణ, అణుశక్తి వైద్య రంగాలకు..
  • మంగంపేటలో లభించే బెరైట్ స్‍లో లభించే 10% మాత్రమే దేశీయంగా..
     
  • రక్షణ, అణుశక్తి వైద్య రంగాలకు ఏపీసీఎండీసీలో లభించే తక్కువ గ్రేడ్ తో..

Chandrababu Letter To Union Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) పరిధిలోని మంగంపేట ముగ్గురాయి (బెరైట్స్) గనుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని భావిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి కీలకమైన లేఖ రాశారు. మంగంపేటలో లభించే ముగ్గురాయి నిల్వలపై ఆంక్షలు విధిస్తే ఏపీసీఎండీసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని, కావున ఆ ప్రతిపాదనను వెంటనే పక్కన పెట్టాలని ఆయన కోరారు. మంగంపేటలో లభించే బెరైట్స్ నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే దేశీయంగా ఆయిల్, గ్యాస్ మరియు రసాయన పరిశ్రమల్లో వినియోగిస్తున్నారని, మిగిలిన అధిక భాగం ఎగుమతులపైనే ఆధారపడి ఉందని సీఎం వివరించారు. ముఖ్యంగా రక్షణ, అణుశక్తి మరియు వైద్య రంగాలకు అవసరమైన అత్యున్నత ప్రమాణాలు మంగంపేటలో లభించే తక్కువ గ్రేడ్ ముగ్గురాయికి ఉండవని, అటువంటి కీలక రంగాలకు ఎంత మేర నిల్వలు అవసరమో అంతవరకు ప్రభుత్వం కేటాయించగలదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం మంగంపేట ప్రాజెక్టులో తక్కువ గ్రేడ్ కలిగిన ముగ్గురాయి నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, వీటిని నాణ్యమైన ముగ్గురాయితో కలిపి (Blending) విక్రయించడం ద్వారా సంస్థకు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నిల్వలను విక్రయించడానికి ఇప్పటికే ఐదేళ్ల కాల పరిమితితో వివిధ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, ఇప్పుడు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ఆ ఒప్పందాలకు విఘాతం కలగడమే కాకుండా బయ్యర్ల నమ్మకాన్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఎగుమతులు ఆగిపోతే మంగంపేట ప్రాజెక్టులో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని, దీనివల్ల ఆ ప్రాంతంలోని సుమారు 150 పల్వరైజింగ్ యూనిట్లు మూతపడి వేలాది కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను, కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షల ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…