LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Government News: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక 'స్కోచ్' అవార్డు.. జ్ఞానభూమి పోర్టల్‌కు జాతీయ గుర్తింపు.!!

AP Social Welfare Department: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన జ్ఞానభూమి పోర్టల్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ (SKOCH) అవార్డు లభించింది. విద్యార్థులకు వేగవంతమైన సేవలు అందించినందుకు గానూ దక్కిన ఈ పురస్కారంపై మంత్రి బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు..

AndhraPravasi News Desk 2 min read
AP Government News: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక 'స్కోచ్' అవార్డు.. జ్ఞానభూమి పోర్టల్‌కు జాతీయ గుర్తింపు.!!

AP Social Welfare Department:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. పేద విద్యార్థుల చదువులకు వెన్నుముకగా నిలుస్తున్న 'జ్ఞానభూమి' పోర్టల్‌కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక స్కోచ్ (SKOCH) అవార్డు లభించింది. ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అత్యంత పారదర్శకంగా, వేగంగా ప్రజలకు చేరవేస్తున్నందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. ఈ విజయం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 28వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరగనుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారిణి బి. లావణ్య వేణి ఈ వేడుకలో పాల్గొని ప్రభుత్వ తరపున అవార్డును అందుకోనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, సాంకేతికతను జోడించి సేవలను సులభతరం చేసినందుకు ఈ గుర్తింపు రావడం విశేషం.

ముఖ్యంగా జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. గతంలో స్కాలర్‌షిప్‌లు లేదా హాస్టల్ అడ్మిషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అప్లై చేసుకున్న వెంటనే పనులు పూర్తవుతున్నాయి. ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లతో పాటు విదేశీ విద్య (అంబేద్కర్ ఓవర్సీస్), సివిల్స్ కోచింగ్ వంటి కీలక సేవలను ఈ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు.

కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, ఉత్తమ పాఠశాలల్లో ప్రవేశాలు, హాస్టల్ వసతి కల్పనలో కూడా ఈ వేదిక పారదర్శకతను పెంచింది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థులకే ప్రయోజనం అందుతోంది. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పులే ఈరోజు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు రావడానికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి డి.ఎస్.బి.వి. స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల సంక్షేమం కోసం తమ శాఖ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. శాఖా పరంగా కృషి చేసిన ప్రతి ఉద్యోగికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…