LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి: సీఎం చంద్రబాబు!

Chandrababu: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి: సీఎం చంద్రబాబు!

వాట్సాప్ గవర్నెన్స్‌తో 1,035 సేవలు – ప్రజలకు సులభ సేవల అందుబాటు..

శాటిలైట్ డేటాతో రియల్‌టైమ్ పాలనకు సీఎం దిశానిర్దేశం..

అమరావతి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడమే లక్ష్యమని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా 1,035 సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఫేజ్-1 కింద ఇప్పటికే 8 కంపెనీలకు భూములు కేటాయించగా, మే రెండో వారంలో ప్లాంట్లు ప్రారంభమవుతాయని తెలిపారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం, ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నేర నియంత్రణలో సీసీ కెమెరాల వినియోగం కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. దీంతో నేరాల గుర్తింపు, మిస్సింగ్ కేసుల పరిష్కారం, వాహనాల దొంగతనాల విచారణ వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇంకా సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ కెమెరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు.

ఇక శాటిలైట్ సమాచారాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్‌తో శాటిలైట్ డేటాను అనుసంధానం చేస్తే, సమస్యలు ముందుగానే గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇటీవల తిరుమల సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఉదాహరణగా చూపిస్తూ, ఇలాంటి ఘటనలకు రియల్ టైమ్‌లో స్పందించే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.

డీజిల్, పెట్రోలు సరఫరాలో తలెత్తిన సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరించిందని, కానీ భవిష్యత్తులో సమస్యలు ఏర్పడకముందే ముందస్తు చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. టెక్నాలజీ ఆధారిత పాలన ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమీక్షలో స్పష్టమైంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…