Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!

AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…!

2025-12-18 14:03:00
Tollywood Update: గొప్ప మనసు చాటుకున్న హీరో.. ఏపీలో ఆ కాలేజీకి రూ.2కోట్లు విరాళం!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉద్యోగ సంఘాలతో నిరంతరం చర్చలు జరుపుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే పిల్లల సంరక్షణ సెలవుల (Child Care Leave – CCL) విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు 180 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా, అవసరమైనప్పుడు ఎప్పుడైనా వినియోగించుకునేలా నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో హర్షాతిరేకాలను రేకెత్తించింది.

Winter Trip: శీతాకాలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మంచు పడే ఈ ప్రాంతాలు అస్సలు మిస్ అవ్వద్దు!

ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోంలో అన్ని జిల్లాల మహిళా ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత విద్యా సాగర్ మాట్లాడుతూ ఉద్యోగులకు మరిన్ని శుభవార్తలు త్వరలోనే రానున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. గత ఆరు సంవత్సరాలుగా సుమారు 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్య పథకాల వివరాలను కూడా సీఎంకు వివరించామని చెప్పారు. ఈ అంశంపై రాబోయే రెండు నెలల్లో ఉద్యోగులకు మేలు చేసే కీలక నిర్ణయం వెలువడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు..

అదేవిధంగా, ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని విద్యా సాగర్ తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు కలిపి లక్షలాది మందికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. సమస్యలను వినడం మాత్రమే కాకుండా, వాటిపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

HAL Hiring: ఫిట్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ ఉద్యోగాలు…! పూర్తి వివరాలు ఇవే!

పిల్లల సంరక్షణ సెలవుల నిబంధనల సడలింపుతో దాదాపు రెండు లక్షల మంది మహిళా ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందని విద్యా సాగర్ వెల్లడించారు. 2018లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ఉద్యోగులకు CCL పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా ఈ సెలవులను చాలా మంది ఉపయోగించుకోలేకపోయారని తెలిపారు. ఈ సమస్యను ప్రస్తుత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి వయో పరిమితి ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన సమస్యల్ని కూడా ఇదే వేగంతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
 

Nidhi Agarwal: లులూ మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లలో మహిళల భద్రత ఎవరి బాధ్యత!
Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్!
Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…!
Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు!
Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!
10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?

Spotlight

Read More →