LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్!

AP Property Tax Rebate 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందే పన్ను చెల్లిస్తే 5% రాయితీతో పాటు, పాత బకాయిల వడ్డీపై 50% మాఫీని అందిస్తోంది. ఈ సువర్ణ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

AndhraPravasi News Desk 1 min read
AP Property Tax Rebate 2026:  ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్!

AP Property Tax Rebate 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు తమ ఆస్తి పన్నును సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు  నగర పంచాయతీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)కి సంబంధించి ఎవరైతే తమ ఆస్తి పన్నును ముందుగానే చెల్లిస్తారో, వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ  లభిస్తుంది. ఈ అవకాశం కేవలం ఈ నెల 30  వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే పన్ను రూపంలో మీరు కట్టాల్సిన మొత్తంలో కొంత భారం తగ్గుతుందన్నమాట.

కొత్త పన్నుపై రాయితీ ఇవ్వడమే కాకుండా, పాత బకాయిలు ఉన్నవారికి కూడా ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. గత ఏడాది (2025-26) వరకు ఆస్తి పన్ను కట్టకుండా పెండింగ్‌లో ఉన్న వారు, ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారి వడ్డీపై 50 శాతం మాఫీ ఇస్తున్నారు. గతంలో ఈ గడువు మార్చి 31తో ముగియగా, ప్రజల అభ్యర్థన మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే పూర్తి వడ్డీతో పన్ను చెల్లించి ఉంటే, అటువంటి వారికి వచ్చే ఏడాది బిల్లులో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం డిజిటల్ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా లేదా మున్సిపల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లోనే ఇంట్లో కూర్చుని పన్ను కట్టే వెసులుబాటు ఉంది. నగదు రహిత చెల్లింపుల వల్ల పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 3,559 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసింది. వడ్డీ మాఫీ పథకం వల్లే చాలా మంది ముందుకు వచ్చి బకాయిలు చెల్లించారని గణాంకాలు చెబుతున్నాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…