LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Veeranjaneyaswamy: అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి.. లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో..

Veeranjaneyaswamy: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. టంగుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా లారీ యజమానులు, పొగాకు కంపెనీ యజమానులు, కలప వ్యాపారులతో టంగుటూరులోని …

AndhraPravasi News Desk 1 min read
Veeranjaneyaswamy: అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి.. లారీ ఓనర్స్ అసోసియేషన్  సమావేశంలో..
  • ప్రకాశం జిల్లా టంగుటూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్  సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి..
     
  • జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా.. 

AP Politics Veeranjaneyaswamy: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. టంగుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా లారీ యజమానులు, పొగాకు కంపెనీ యజమానులు, కలప వ్యాపారులతో టంగుటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి స్వామి ప్రసంగించారు. లారీ ఓనర్లు న్యాయబద్ధంగా కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా రవాణా సాగించాలన్నారు. జిల్లా అంతట రవాణా ధరలు ఒకే విధంగా ఉండేలా చూడాలని చెప్పారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు గ్రీన్ టాక్స్ తగ్గింపు చేస్తామని ఇచ్చిన హామీనీ నెరవేర్చామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుంతల రోడ్లను మరమ్మత్తులు చేసి వాహనాలు దెబ్బ తినకుండా పరోక్షంగా చర్యలు చేపట్టామని అన్నారు. 

జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా అసోసియేషన్ కు రవాణా రంగం ద్వారా లాభాలు పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లను ప్రతి జిల్లాలో గుర్తించామన్నారు. రహదారుల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు రూ.కోటి నిధులను ముఖ్యమంత్రి ఇవ్వనున్నట్లు తెలిపారు. టంగుటూరు టోల్  పన్ను రాయితీపై అసోసియేషన్ నిర్వాహకులు అర్జీ సమర్పించాలని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిస్తామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని. బ్యాటరీ వాహనాలపై రాయితీ కల్పిస్తున్నట్లు, దీనిని లారీ ఓనర్స్ అసోసియేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిగురుపాటి గిరి, ఒంగోలు, కందుకూరు, టంగుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరి అంజిబాబు, కంచర్ల మాధవరావు, కొత్త నాగేశ్వరరావు, సూధనగుంట శ్రీనివాసరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…