LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!

Electricity: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్…

AndhraPravasi News Desk 1 min read
Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!

కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకూ కరెంట్ ఛార్జీల పెంపు లేదు..

యూనిట్‌కు రూపాయి తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి యూనిట్‌పై కనీసం రూపాయి మేర ఛార్జీలు తగ్గించాలని సీఎం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని వెల్లడించారు.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో “ట్రూఅప్” పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజలపై భారం మోపకుండా “ట్రూడౌన్” విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే ఆంధ్రప్రదేశ్‌కు 20 లక్షల “సూర్యఘర్” కనెక్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. దీని ద్వారా సాధారణ కుటుంబాలు విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అవసరానికి అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించి విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు, పునరుత్పాదక శక్తికి ప్రోత్సాహం, ప్రజలపై అదనపు భారం లేకుండా సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని శక్తి పరంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…