LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..!

Amaravati Capital Legality: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ 'మూడు ముక్కలాట' వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తూ, చంద్రబాబు నాయకత్వంలో అమరావతి మళ్లీ అభివృద్ది అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..!

Amaravati Capital Legality: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కొనియాడారు. శనివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానానికి మద్దతుగా ఆమె మాట్లాడారు. ఈ నిర్ణయం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని, ఇది రాష్ట్రంలోని భావితరాల  భవిష్యత్తుకు గట్టి భరోసా ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.  రాజధాని నగరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి సంపద పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వగానే, ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషమని మంత్రి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా దాదాపు 33 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించడం ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి అని గుర్తు చేశారు. ఇది కేవలం చంద్రబాబు గారిపై ఉన్న నమ్మకంతోనే సాధ్యమైందని ఆమె తెలిపారు. నాడు ప్రధాని నరేంద్ర మోదీ గారు పవిత్ర నదుల జలాలు, మట్టిని తీసుకొచ్చి ఈ నగరానికి పునాది వేశారని, అటువంటి పవిత్రమైన నగరాన్ని నిర్మించడం మనందరి బాధ్యతని మంత్రి సవిత వివరించారు.

గత ఐదేళ్లలో అమరావతి విషయంలో జరిగిన గందరగోళంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నామని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని నమ్మబలికిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. "మూడు ముక్కలాట" పేరుతో రాజధానిని అస్థిరపరిచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని, పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి పనులు మళ్ళీ ఊపందుకున్నాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం రాజధానిపైనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె తెలిపారు. ప్రాంతాల వారీగా హార్టీకల్చర్, సిరికల్చర్, పారిశ్రామిక మరియు టెక్స్‌టైల్ హబ్‌లను ఏర్పాటు చేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె వివరించారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ కొత్త తీర్మానం వల్ల భవిష్యత్తులో ఎవరూ రాజధానిని కదిలించే సాహసం చేయలేరని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుందని, తద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతం ఒక సంపద సృష్టించే కేంద్రంగా మారి, యువతకు భారీగా ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…