అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల భేటీ వివరాలు ... నిన్న (శనివారం) రాత్రి ఉండవల్లిలో జరిగిన ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించి నట్టు తెలుస్తోంది.
టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం కలిపి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు టీడీపీ , జనసేన వర్గాలు పేర్కొన్నాయి. భేటీలో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయమై ఇరువురు నేతలు చర్చించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగుదేశం - జనసేన పార్టీల్లో వైకాపా నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపు పైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. అదే విధంగా మందడంలో ఆదివారం నిర్వహించే భోగి మంటలు కార్యక్రమం ఇరు పార్టీల నేతలు కలిసి పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దహనం చేయనున్నారు. సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాటు తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ , జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి